Switch to English

థాంక్యూ రివ్యూ – రొటీన్ జర్నీ

Critic Rating
( 2.00 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

Movie థాంక్యూ
Star Cast నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్
Director విక్రమ్ కె కుమార్
Producer దిల్ రాజు
Music థమన్
Run Time 2 గం 9 నిమిషాలు
Release 22 జూలై 2022

అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో వచ్చిన థాంక్యూ మూవీ ఈరోజే విడుదలైంది. మొదటి నుండి లో బజ్ లోనే ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా.

కథ:

అభిరామ్ (నాగ చైతన్య) చాలా కష్టాలు పడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఒక యాప్ ను తయారుచేయడం ద్వారా సక్సెస్ఫుల్ అవుతాడు. దీనికి ప్రియా (రాశి ఖన్నా) ఫండింగ్ చేస్తుంది. అయితే జీవితంలో పైకి వచ్చాక అభిరాం కు పొగరు, ఇగో, తానే గొప్ప అన్న అహం వచ్చేస్తాయి. ఈ ప్రవర్తన నచ్చని ప్రియా, అభిరామ్ ను వదిలి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత అభిరామ్ కు కనువిప్పు కలుగుతుంది. ఇప్పుడు తను ఉన్న స్థాయికి ఏదో రకంగా హెల్ప్ చేసిన వారందరికీ థాంక్యూ చెప్పాలని జర్నీ మొదలుపెడతాడు. ఈ జర్నీలో అభిరామ్ ఎదుర్కొనే అనుభవాలు ఏంటి? ఈ స్థాయికి రావడంలో అభిరామ్ జర్నీ ఎలాంటి పాత్ర పోషించింది వంటివి ఈ సినిమాకు కీలకం.

నటీనటులు:

నాగ చైతన్య నటుడిగా చాలా పరిణితి సాధించాడు. ఈ పాత్రకు భిన్న పార్శ్యాలు ఉన్నాయి. వాటిని చూపించడంలో నాగ చైతన్య రాణించాడు. తన మల్టీ లేయర్ పాత్ర ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్.

ఇక రాశి ఖన్నా పాత్ర, తన స్క్రీన్ ప్రెజన్స్ కొన్ని సీన్స్ లో రియలిస్టిక్ ఫీల్ ను తీసుకురాగలిగాయి. మరో హీరోయిన్ మాళవిక నాయర్ ఉన్నది చిన్న పాత్రలోనే అయినా మెప్పించింది. ఇక అవికా గోర్ క్యామియో తరహా పాత్రలో ఓకే అనిపించింది. సాయి సుశాంత్ రెడ్డికి కీలక పాత్ర దక్కింది. తను రాణించాడు. ప్రకాష్ రాజ్, ఈశ్వరి రావు తమ పాత్రల్లో ఓకే అనిపించారు.

సాంకేతిక నిపుణులు:

పీసీ శ్రీరామ్ తన స్థాయికి తగిన ఔట్పుట్ ఇచ్చాడనే చెప్పాలి. సినిమా మొత్తాన్ని ఒక స్థాయిలో, రిచ్ గా చుపించడంలో తన పాత్ర ఎంతో ఉంది. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ పర్వాలేదు. తన స్థాయి ఔట్పుట్ అయితే కాదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే.

నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ బాగున్నాయి. ఇంటర్వెల్, క్లయిమాక్స్ కు ముందు వచ్చే డైలాగ్స్ ఇంప్రెస్ చేస్తాయి. ఇక నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

విక్రమ్ కె కుమార్ సినిమాల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. స్టోరీ సంగతి ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే పరంగా ది బెస్ట్ ఇస్తాడు. సరికొత్తగా ఉండేలా చూస్తాడు. అయితే గత కొద్ది కాలం నుండి విక్రమ్ కుమార్ సినిమాలు తన స్థాయికి తగినట్లు లేవు. ఈ ఎఫెక్ట్ థాంక్యూపై బాగా పడింది. ఈ సినిమాలో రొటీన్ ట్రీట్మెంట్ తో నిరాశపరిచాడు. బివిఎస్ రవి కథలో ఎలాంటి కొత్తదనం లేదు.

పాజిటివ్ పాయింట్స్:

  • నాగ చైతన్య
  • ఎమోషనల్ ఎపిసోడ్స్

నెగటివ్ పాయింట్స్:

  • స్టోరీ
  • స్క్రీన్ ప్లే

విశ్లేషణ:

థాంక్యూ అభిరామ్ యొక్క రొటీన్ జర్నీ. నరేషన్ అంతా కూడా ఎలాంటి హై పాయింట్స్ లేకుండా ఫ్లాట్ గా సాగిపోతుంది. చైతన్య నటన ఒక్కటే ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. మొత్తంగా థాంక్యూ నిరాశపరిచే జర్నీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా...

రాజకీయం

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

ఎక్కువ చదివినవి

నాగార్జున ది ఘోస్ట్ చిత్రీకరణ పూర్తి

గత కొంత కాలంగా వరస పరాజయాలతో అక్కినేని నాగార్జున ఇబ్బందిపడుతున్నాడు. భారీ హిట్ తో కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే నాగ్ ప్రస్తుతం చేస్తోన్న ది ఘోస్ట్ పై చాలా నమ్మకంగా...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన ఫ్యాన్స్

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

డిస్నీప్లస్ హాట్ స్టార్ లో “వారియర్” సంచలనం!!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...