Switch to English

TFCC Nandi Awards: టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వ సహాయ స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో 13 మంది జ్యూరీ సభ్యుల సమక్షంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుక‌లు ఆగస్టు 12 న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ ను హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వటైజర్, నటుడు ఆలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైటర్ మిట్టపల్లి సురేందర్, పల్లె లక్ష్మణ్ గౌడ్, ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి, హీరోయిన్ భవ్యశ్రీ, కోటేశ్వరరావు, రాదాకృష్ణ, బి. శ్రీనివాస్ గౌడ్,రాజ్, ప్రేమ్, శ్రీశైలం, వాహిద్, నిర్మాత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

టియ‌ఫ్ సీసీ చేర్మెన్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. దాదాపు 6, 7 సంవత్సరాల తర్వాత రెండు ప్రభుత్వాల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి కొంత స్పాన్సర్ కూడా చేస్తామని చెప్పారు.అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఆగస్టు 12 న దుబాయ్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు 75 లక్షలు రెంట్ కట్టడం జరిగింది.ఈ నంది అవార్డ్స్ కు రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

అలాగే కేరళ సి.యం కూడా రావడం జరుగుతుంది. మరియు సౌత్ ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది హీరోలే కాకుండా బాలీవుడ్ నుండి కూడా పలువురు ప్రముఖులు రావడం జరుగుతుంది. తెలుగు కళాకారులను ప్రోత్సహించాలానే ఉద్దేశ్యంతో ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా నేను చేస్తున్న కార్యక్రమం కొరకు నేను కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నానని నిందలు మోపుతున్నారు. నేను ఎవరిదగ్గరా డబ్బులు తీసుకోకుండా నేను నిజాయితీగా పనిచేస్తున్నాను. దుబాయ్ కు వెళ్లినాకూడా నేను సొంతంగా టికెట్ కొన్నాను. నేను ఎవరి దగ్గరైనా తీసుకున్నట్టు ప్రూవ్ చెయ్యండి. ఇదంతా నా సొంత ఖర్చులతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఎవరికీ హనీ చేసే వ్యక్తిని కాదు. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఓపెన్ గా అడగండి. నేను వారికీ సమాధానం చెపుతాను. ఇక ఈ అవార్డ్స్ కొరకు ప్రెజెంట్ సినిమాలనుండి ఎంట్రీస్ వస్తున్నాయి. డిసెంబర్ 2019 లోని సినిమాలు కూడా ఎంట్రీ అవ్వచ్చు.ఇవి జూన్ 15 th వరకు వచ్చిన ఎంట్రీ ని జ్యూ రీ కమిటీ నిర్ణయం ప్రకారమే సెలెక్షన్స్ జరుగుతాయి. అందరి నిర్మాతలను కలుపుకొని తెలంగాణ, ఆంధ్ర అని బేధాలు లేకుండా అందరూ కలసి పని చేస్తాము. ఈ నంది అవార్డ్స్ ప్రతి సంవత్సరం దుబాయ్ లోనే కంటిన్యూ చేస్తాము తప్ప ఆపే ప్రసక్తే లేదని అన్నారు.

నటుడు ఆలీ మాట్లాడుతూ.. 1964 నుండి నంది అవార్డ్స్ ఉన్నాయి.నంది అవార్డు అనేది ప్రతి ఆర్టిస్ట్ కల, అలాంటిది 7 సంవత్సరాలక్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్ ను మళ్ళీ స్టార్ట్ చేస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదములు. అలాగే సీనియర్ నటుల పేరుతో కూడా స్మారక అవార్డ్స్ ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియా నుండి కూడా సినీ, రాజకీయ ప్రముఖులు రావడం మరియు బాలీవుడ్ నుండి కుండా జితేందర్, జాకీ షరఫ్ తదితరులు రావడం గొప్ప విషయం.ఇలాంటి మంచి పని చేస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి నా అభినందనలు అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ. కళకు కులం, మతం, జాతి, ప్రాంతం వంటి బేధాభిప్రాయాలు లేవు . కళాకారులను ప్రోత్సహించేందుకు అన్ని భాషల్లో అవార్డ్స్ జరుగుతున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరగక పోవడం దురదృష్టకరం. నంది అవార్డు అనేది మన తెలుగు కళాకారులకు ప్రతిష్టాత్మకమైన అవార్డు.అయితే గ‌త కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ ని మ‌ళ్లీ ప్ర‌తాని రామ‌కృష్ణ గారు రెండు ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో చేయడం చాలా సంతోషం. తెలుగు కళాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చి మంచి పని చేస్తున్న తనపై నింద మోపడం సరైన పద్దది కాదు. మీకు చెయ్యడానికి ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు రండి మేము సహకరిస్తాము అంతే తప్ప మనం చేయం, చేసే వారిని చేయనివ్వం. కాబట్టి చేసే వారికి అడ్డు పడకుండా మన ఇండస్ట్రీ కోసం మంచి చేసే వారి మీద బురద జల్లకుండా మంచి చేసే రామకృష్ణ గౌడ్ గారి లాంటి వారికి సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. నంది అవార్డు అంటే ఆది ఒక ప్రిస్టేజ్. గతంలో నాకు నంది అవార్డు వచ్చింది. అవార్డ్స్ అనేవి ఎప్పుడూ మ‌న‌లో ఉత్సాహాన్ని నింపుతాయి
ఇప్పుడు రామకృష్ణ గౌడ్ గారు ముందుకు వచ్చి చేస్తున్న ఈ నంది అవార్డు ఫంక్షన్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...