Switch to English

Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Sarath Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు( Sarath Babu) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శరీరం విషతుల్యం కావడంతో ఆ ప్రభావం ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం గుండె పై పడింది. దీంతో శరత్ బాబు ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

తన అందం, నటన తో 70, 80 ల్లో టాలీవుడ్ లో స్టార్ నటుడుగా వెలుగొందారు. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ప్రతినాయక, సహాయక పాత్రల్లో కనిపించారు. నటనకు గాను ఈయన ఏకంగా 8 నంది అవార్డులను అందుకున్నారు. ‘అభినందన’ చిత్రంలో శరత్ బాబు పోషించిన సహాయ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సీతాకోకచిలుక, ఓ భార్య కథ, నీరాజనం చిత్రాలకి గాను సహాయ నటుడు గా నంది అవార్డులు అందుకున్నారు. వీటితోపాటు మరెన్నో హిట్ చిత్రాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 200 చిత్రాలకు పైగా శరత్ బాబు నటించారు. చివరిసారిగా తెలుగులో ‘వకీల్ సాబ్’ చిత్రంలో లాయర్ గా కనిపించారు.

పోలీస్ అవుదామనుకొని ..

శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శ్రీకాకుళంలోని ఆమదాలవలస లో 1951 లో జన్మించారు. శరత్ బాబు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కనేవారట. అయితే ఆయనకు కంటి సమస్యలు తలెత్తడంతో పోలీస్ కాలేకపోయారు. అనుకోకుండా ఓ పేపర్ యాడ్ చూసి ఆడిషన్ కు వెళ్లారు. అలా డైరెక్టర్ కె బాలచందర్(K Bala Chandar) దర్శకత్వం వహించిన ‘అవరుగల్’ అనే తమిళ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆ సినిమా ‘ఇది కథ కాదు’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది. చిరంజీవి( Chiranjeevi), కమల్ హాసన్( Kamal Hassan), జయసుధ( Jayasudha), సరిత( Saritha), రమాప్రభ( Ramaprabha) వంటి భారీతరాగణం ఉన్న ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో శరత్ బాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. శరత్ బాబు.. 1974 లో సీనియర్ నటి రమాప్రభ ని వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల 1988 లో వీరిద్దరూ విడిపోయారు. తర్వాత 1990 లో స్నేహ నంబియార్ ని వివాహం చేసుకుని 2011లో విడాకులు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...