Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ మంచి కమర్షియల్ హిట్స్ అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతున్నాడు. బాల నటుడి నుంచి ప్రమోషన్ పొంది హీరోగా మారిన తేజ ఇప్పుడు వరుసగా విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు.
తాజాగా తేజా హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రూ.300 కోట్లకు పైగా హనుమాన్ సినిమా వసూళ్లు సాధించింది అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఆ విషయం పక్కన పెడితే హనుమాన్ సినిమా తర్వాత తేజా నుంచి రాబోతున్న సినిమా ఏంటి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే హనుమాన్ మూవీకి సీక్వెల్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. అయితే వెంటనే సీక్వెల్ ప్రారంభం అవ్వబోతుందా లేదంటే ఈ గ్యాప్ లో తేజా సజ్జా ఒక చిన్న మూవీని చేస్తాడా అనేది అందరి మనసులో తలెత్తుతున్న ప్రశ్న.
తేజా మరో చిన్న సినిమా చేయకుండా డైరెక్ట్ గా హనుమాన్ సీక్వెల్ ను చేస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. జై హనుమాన్ ను 2025 లో విడుదల చేస్తాం అన్నట్లుగా ప్రశాంత్ వర్మ గతంలో పేర్కొన్నాడు. మరో వైపు తేజా తదుపరి సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.