Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో రాజ్యాంగమన్నది వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ విపక్షాల నుంచి వినిపిస్తోన్న వాదన.

ఎవడికి దెబ్బ తగిలితే, వాడు మాత్రమే ఏడుస్తాడన్నది పదే పదే నిరూపితమవుతోన్న వాస్తవం. వ్యవస్థలు నాశనమైపోతున్నా పట్టించుకోవాల్సిన కేంద్రం పట్టించుకోవడంలేదన్నదీ నిర్వివాదాంశం. చివరికి బీజేపీ నేతలు, కార్యకర్తల మీద వైసీపీ గూండాల దాడులు జరుగుతున్నా.. ‘పెద్దన్న’ బాధ్యతను కేంద్రం విస్మరిస్తుండడం శోచనీయం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న డిమాండ్ నిన్న తెలుగుదేశం పార్టీ నుంచి దూసుకొచ్చింది. స్థానిక ఎన్నికల వేళ, విపక్షాల నుంచి అభ్యర్థులు నిలబడలేని దుస్థితిని రాష్ట్రంలో అమలవుతోన్న ఓ దిక్కుమాలిన రాజ్యాంగం తీసుకొచ్చింది. నామినేషన్లు వేయడానికి వెళితే, విపక్ష అభ్యర్థులపై దారుణాలకు తెగబడ్డారు అధికార పార్టీ నేతలు. అయినా, కేంద్రం స్పందించలేదు.

తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార పార్టీ దొంగ ఓటర్లను బస్సుల్లోనూ, ఇతర వాహనాల్లోనూ తీసుకొచ్చినా.. కేంద్రం లైట్ తీసుకుంది. ఇప్పుడు ఏకంగా విపక్ష పార్టీలకు చెందిన కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నాయి వైసీపీ మూకలు. మరిప్పుడైనా కేంద్రం రాష్ట్రంలోని పరిస్థుతులపై స్పందిస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

‘వాళ్ళే ప్రభుత్వాధినేతను తిట్టారు.. ఆపై వాళ్ళే తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసుకున్నారు..’ అని హోం మంత్రి నుంచి ప్రకటన వచ్చాక, ఈ తరహా రాజకీయ దాడులు ముందు ముందు ఆగే అవకాశమే లేదు సరికదా, ముందు ముందు మరిన్ని దాడులు జరిగే ప్రమాదముంది.

‘మా నాయకుడి మాటకు కట్టుబడి ఆగిపోతున్నాం.. లేదంటే, మీ పార్టీ కార్యాలయాలపై దాడులు జరగకుండా వుంటాయా.?’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి ‘ట్వీటు’ వచ్చిందంటే.. ముందు ముందు రాష్ట్రంలో రాజకీయం ఇంకెంత భయానకంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత భయానక పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావాలంటే రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గమే లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

లొకేషన్స్ వేటలో పడ్డ హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోన్న విషయం తెల్సిందే. గతంలో వీరి కాంబినేషన్ లో...

బిగ్ బాస్ 5: ఈసారి ఏ కంటెస్టెంట్ కు మూడింది?

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఇంకా హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారాంతం ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే...

అఖండ: బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించిన బాలయ్య

ఒక మాస్ సినిమా కలిగించే ఊపు వేరు. బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి వచ్చిన అఖండ పేరుకి తగ్గ రీతిలో అఖండమైన ఓపెనింగ్ ను...

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో...

రాజకీయం

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

ఎక్కువ చదివినవి

రెండున్నరేళ్ళు.. అప్పులు తప్ప అభివృద్ధి ఏదీ.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలనను పూర్తి చేసుకున్నారు.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న వైఎస్ జగన్, అధికారం కోసం చాలా చాలా...

సిగ్గులేని రాత: చంద్రబాబు ప్రభుత్వమేంటి.? జగన్ ప్రభుత్వమేంటి.?

చంద్రబాబు హయాంలో.. వైఎస్ జగన్ హయాంలో.. అనాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం.. అనే స్థాయికి జర్నలిజం ఏనాడో దిగజారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఆ విధానాన్నే ఫాలో అవ్వాల్సి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

అస్సలు అవినీతికి అవకాశమే లేకుండా అద్భుతమైన పాలన అందించేస్తున్నామని అంటోంది ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం. మరి, లక్షల కోట్ల రూపాయల అప్పులెందుకు పెరిగిపోతున్నట్లు.? కరోనా సంక్షోభం కారణంగా ప్రజల్ని ఆదుకోవడానికి అప్పలు...

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

ఏడాదిలో నాలుగు చిత్రాల రిలీజ్ లను ప్లాన్ చేస్తోన్న చిరు

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు వేగంగా సినిమాలు చేసేవాడు కానీ టాప్ స్థాయికి చేరుకున్నాక బాగా తగ్గించేసాడు. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా ఏడాదికి ఒకట్రెండు సినిమాలే చేస్తూ వస్తున్నాడు. అయితే చిరంజీవి ఇప్పుడు...