Switch to English

అసలు సిసలు వెన్నుపోటు.. అప్పుడూ.. ఇప్పుడూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడానికి కారణమెవరు.? మొట్టమొదటిగా విభజనకు అనుకూల నిర్ణయం తీసుకున్నది తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంలో ‘మేమే తెలంగాణకు అనుకూలంగా మొట్టమొదట లేఖ ఇచ్చాం..’ అని చంద్రబాబు చెప్పుకున్నారు. కాంగ్రెస్‌ హయాంలో విభజన జరిగిందన్నది నిర్వివాదాంశం. ఆ విభజనకు బీజేపీ సహకరించిందన్నదాంటోనూ ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అలా, రాష్ట్ర విభజన విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శించిన టీడీపీ, 2014 ఎన్నికల్లో, తెలంగాణలో దెబ్బతినేసినా.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది.

ఇప్పుడు అమరావతికి వెన్నుపోటు పొడిచింది తెలుగుదేశం పార్టీ. ఐదేళ్ళు సరిపోలేదు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి, అమరావతిని నిర్మించడానికంటే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? ఇక, ఇప్పుడు మూడు రాజధానుల ఎపిసోడ్‌ తెరపైకొచ్చింది. ‘మేం అమరావతికి కట్టుబడి వున్నాం..’ అని ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కానీ, ఇప్పుడేం జరిగింది.? అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌నీ, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌నీ తరలిస్తున్నారు. అమరావతి ఇకపై కేవలం శాసన రాజధాని మాత్రమే. అంటే, అక్కడ అసెంబ్లీ మాత్రమే వుంటుంది. అసెంబ్లీ అంటే, ఏడాదికి ఓ మూడు సార్లు.. అది కూడా ఇటీవలి కాలంలో ‘నామ్ కే వాస్తే’ అన్నట్టు తయారైంది. ఆ లెక్కన, సమీప భవిష్యత్తులో అమరావతి ఉనికి అనేది వుండకపోవచ్చు.

అసలు సిసలు వెన్నుపోటు అంటే ఇదే మరి.! ప్రత్యేక హోదా నినాదాన్ని అటు టీడీపీ, ఇటు వైసీపీ గాలి కొదిలేశాయి.. ఈ రెండూ ’60-40’ ఒప్పందాలతో అధికారం పంచుకుంటున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ప్రత్యేక హోదా గురించి టీడీపీ అధికారంలో వున్నప్పుడు మాట్లాడలేదు.. వైసీపీ కూడా అధికారంలోకి వచ్చాక మాట్లాడటంలేదు. అధికారం లేనప్పుడు మాత్రం ఈ రెండు పార్టీలకీ ప్రత్యేక హోదా అవసరమైంది. ఇదొక్కటి చాలు.. టీడీపీ, వైసీపీ.. ఏ స్థాయిలో ‘వెన్నుపోటు’ రాజకీయాలు నడుపుతున్నాయో చెప్పడానికి. ఇదే, ఆంధ్రప్రదేశ్‌కి.. ఈ ‘వెన్నుపోటు రాజకీయమే’ పెను శాపంగా మారింది. ఐదేళ్ళలో ఒక్క రాజధానినే నిర్మించుకోలేకపోయిన ఆంధ్రప్రదేశ్‌, సమీప భవిష్యత్తులో మూడు రాజధానుల్ని నిర్మించుకునే పరిస్థితి వుంటుందా.? జనాన్ని మభ్యపెట్టడానికి కాకపోతే, ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో ‘విజ్ఞత’ కాస్తంతైనా కన్పిస్తుందా.!

తాము ఏం చెప్పినా, జనం నమ్మి ఓట్లు వేస్తారనే నమ్మకం ఆయా పార్టీల్లో వున్నంత కాలం.. ఆ నమ్మకాలు నిజమవుతున్నంత కాలం.. ఆంధ్రప్రదేశ్‌ మళ్ళీ మళ్ళీ వెన్నుపోటుకి గురవుతూనే వుంటుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....