రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసాడు ఆశిష్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ పట్ల దిల్ రాజు సంతోషంగా ఉన్నాడు. ఈ విషయమై ప్రెస్ మీట్ లో పలు విశేషాలను షేర్ చేసుకున్నాడు. రౌడీ బాయ్స్ 4.5 కోట్లను వసూలు చేసినట్లు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ లో కలెక్షన్స్ బాగున్నాయని, తెలంగాణలో కూడా పికప్ అవుతోందని దిల్ రాజు చెప్పాడు.
ఇక ఆశిష్ రెండో సినిమా కూడా కన్ఫర్మ్ అయిందని, సుకుమార్ అసోసియేట్ కాశీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడని తెలిపాడు. అంతే కాకుండా సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను అందించనున్నాడని కన్ఫర్మ్ చేసాడు.
ఆర్య తర్వాత 18 ఏళ్ల గ్యాప్ తర్వాత సుకుమార్ తో కలిసి పనిచేస్తుండడం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ చిత్రానికి సెల్ఫిష్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశామని అన్నాడు. పూర్తిగా భిన్నమైన కథాంశంతో తెరకెక్కనుందని తెలియజేసాడు.