Switch to English

ఇంకా ఎన్నాళ్ళు ఈ దుస్థితి రాజా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

గత నెల రోజులుగా అమరావతి రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, నినాదాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం అక్కడ దాదాపుగా రూ. 10వేల కోట్లు ఖర్చు చేసింది. అంతేకాదు, సంవత్సరానికి 5వేల కోట్ల రూపాయల చొప్పున అమరావతిలో పెట్టుబడులు పెట్టుకుంటూ పొతే… ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దొచ్చు అన్నది గత ప్రభుత్వం ప్లాన్. ప్లాన్ బాగానే ఉన్నది. అయితే, ఈ ప్లాన్ ను అమలు చేయడంలో ఆలస్యం చేసింది. అదే ఇప్పుడు కొంపముంచింది.

10 వేల కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక భవనాలు నిర్మించడమే చేసిన తప్పు. అలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన కొన్ని నిర్మాణాలు చేపట్టి ఉంటె ఇప్పుడు వైకాపా ప్రభుత్వం రాజధానిని మార్చేందుకు సాహసం చేసేది కాదు. తాత్కాలిక భవనాలు ఎందుకు కట్టారు అని వైకాపా ప్రభుత్వం అడిగితె బాబు దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో వైకాపా ఆడింది ఆటగా మారిపోయింది.

33 వేల ఎకరాల భూమిని బాబు హయాంలో రైతులు రాజధాని కోసం ఇచ్చారు. రాజధాని విషయంలో బాబు తప్పు చేశారు. ప్రజలను మోసం చేశారు. బాబు చేసిన తప్పులకు తామెందుకు సమాధానం చెప్పాలి అని వైకాపా నేతలు అంటుంటే, తెలుగుదేశం పార్టీ మాత్రం, రాజధానిని మార్చే హక్కు మీకెవరు ఇచ్చారని ప్రశ్నిస్తోంది. రాజధానిని మార్చాలి అంటే ప్రజలు ఒప్పుకోవాలని, ప్రజాసమ్మతితోనే మార్పు సాధ్యం అవుతుందని, అలా కాకుండా బలవంతంగా మార్చాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలుగుదేశం పార్టీ అంటోంది.

ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో పాపం రైతులు నలిగిపోతున్నారు. భవిష్యత్తులో తమ జీవితాలు బాగుపడతాయని, తమ బిడ్డలతో పాటు, రాష్ట్రంలోని చాలామందికి మంచి జరుగుతుందని చెప్పి భూములను రాజధాని కోసం ధారాదత్తం చేశారు. అలా తీసుకున్న భూములను ప్రభుత్వం చదును చేసి రోడ్లు వేసింది.

ఇప్పుడు ఆ స్థలంలో రాజధాని కట్టడం లేదని అంటే పాపం ఆ రైతులు ఏమైపోవాలి. అసలు రాజధాని గురించి మాట్లాడని విశాఖకు రాజధానిని తరలిస్తామని అనడం ఏంటి… పైగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అమరావతి రైతులు. చూస్తుంటే రాజధాని సమస్య రాష్ట్రం దాడి దేశ సమస్యగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...