రీల్ లైఫ్ లో విలన్ పాత్రలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సోను సూద్ తాను రియల్ హీరోని అని కరోనా సమయంలో చాటి చెప్పాడు. కోవిద్ వల్ల వివిధ ఇబ్బందులు పడ్డ ప్రజలకు తన వంతుగా ఎంతో సహాయం చేసి అందరి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.
తిరిగి తన నట జీవితంతో బిజీగా మారాడు సోను సూద్. ఆచార్య లో విలన్ గా నటిస్తున్నాడు సోను. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోను సూద్ చిత్ర విశేషాలను తెలుపుతూ నన్ను కొట్టే సీన్ లో చిరు సర్ చాలా ఇబ్బందిపడ్డారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నిన్ను నేను ఎలా కొట్టాలి అని అన్నారు. ఇకపై నేను విలన్ పాత్రలు చేయను. హీరోగా నాలుగు మంచి స్క్రిప్ట్ లు నా వద్దకు వచ్చాయి అని తెలిపాడు సోను సూద్.
ఆచార్యలో నా గుండెలపై చిరు సర్ కాలు పెట్టే సీన్ ను కూడా రీషూట్ చేసినట్లు తెలిపాడు.
186577 582651This style is spectacular! You certainly know how to maintain a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own weblog (nicely, almostHaHa!) Great job. I actually enjoyed what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 653827