మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫెర్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే దీని తర్వాత బాబీ దర్శకత్వంలో కూడా చిరు సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు కూడా షురూ అయ్యాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె పాత్ర చాలా ప్రాముఖ్యమైందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది.
726337 344942I like this website really considerably so considerably superb information . 33527
112036 390338Fantastic beat ! I would like to apprentice whilst you amend your internet web site, how can i subscribe for a weblog internet site? The account helped me a applicable deal. I had been tiny bit acquainted of this your broadcast provided shiny transparent thought. 128905