Switch to English

Shaakuntalam Review: శాకుంతలం మూవీ రివ్యూ

Critic Rating
( 2.25 )
User Rating
( 2.30 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow
Movie శాకుంతలం
Star Cast సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ
Director గుణశేఖర్
Producer నీలిమ గుణ
Music మణి శర్మ
Run Time 2 గం 22 నిమిషాలు
Release 14 ఏప్రిల్ 2023

Shaakuntalam Review: సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ గ్రాఫిక్స్ చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుండి స్ఫూర్తి పొంది ఈ కథను రాసారు గుణశేఖర్. మరి ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా?

కథ:

శాకుంతలం టైటిల్ కు తగ్గట్లే శకుంతల యొక్క కథ. విశ్వామిత్రుడు, మేనకలకు జన్మించిన శకుంతల విధి కారణంగా కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుతుంది. అయితే అక్కడికి వచ్చిన దుశ్యంత మహారాజు శకుంతలను చూసి మోహిస్తాడు. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. అంతా బానే ఉంది అనుకున్న సమయంలో దుశ్యంత మహారాజు శకుంతలను పూర్తిగా మర్చిపోతాడు.

అలా ఎందుకు జరుగుతుంది? శకుంతల మళ్ళీ గుర్తుతేవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? చివరికి ఏమైంది? అన్నది చిత్ర కథ.

నటీనటులు:

సమంత ఎంత మంచి నటి అన్నది మనం ఇదివరకు చాలా సార్లే చూసాం. ఇక శాకుంతలం వంటి పౌరాణిక పాత్రలకు కూడా తాను సరిగ్గా సరిపోతానని ఈ చిత్రంతో నిరూపించింది సమంత. సెకండ్ హాఫ్ లో దుశ్యంత మహారాజుని ఎదుర్కొనే సందర్భంలో సమంత నటన అద్భుతం. ఆమె నిజంగా ఒక మహిళ ఆత్మగౌరవంతో ఎలా ఉండాలో అన్నది చక్కగా చూపించింది. అయితే అదే సమయంలో ఫస్ట్ హాఫ్ లో దుశ్యంత మహారాజుతో ప్రేమలో పడే సందర్భంలో ఆమెలో ఉన్న ఫెమినిన్ సైడ్ ను సరిగ్గా చూపించలేదు అనిపిస్తుంది.

ఇక దుశ్యంతుడిగా నటించిన దేవ్ మోహన్ బాగా చేసాడు. మహారాజుగా సరిగ్గా సరిపోయాడు. అయితే తనకు అనుకున్న రేంజ్ లో స్క్రీన్ ప్రెజన్స్ దక్కలేదు.

అల్లు అర్హ క్యామియో గురించి కచ్చితంగా ప్రస్తావించాలి. ఆమె భరతుడి పాత్రలో చార్మింగ్ ఇంకా క్యూట్ గా ఉంది. మోహన్ బాబు కబీర్ సింగ్, ఇంకా మిగిలిన వాళ్ళు సినిమాకు తగ్గట్లుగా కనిపించారు.

సాంకేతిక నిపుణులు:

శాకుంతలంకు మోడరన్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు గుణశేఖర్. ఇప్పటికే స్క్రీన్ పై ఈ కథను చాలా సార్లు మనం చూసాం. ఇంకా కొత్తగా చూపించడం దాదాపు అసాధ్యం. అయితే అందులో కూడా ఫైట్ సెక్యూన్సెస్ ను పెట్టి గుణశేఖర్ తనదైన టచ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ఈ చిత్రంలో మెలోడ్రామాను తగ్గించే ప్రయత్నం చేసాడు. అయితే దానివల్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా లీడ్ పెయిర్ మధ్య అత్యంత ముఖ్యమైన కెమిస్ట్రీ అనేది పూర్తిగా మిస్ అయింది.

మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అనుకున్నంత ప్రభావంగా లేదు. సందర్భానికి తగినట్లుగా పాటలు వచ్చాయి కానీ అవి కూడా ఇంపాక్ట్ చూపించింది లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. శాకుంతలంకి ఉన్న మరో ప్రధాన సమస్య విఎఫ్ఎక్స్. అది ఒక్కటి సరిగ్గా ఉండి ఉంటే పైన చెప్పుకున్న చాలా సమస్యలు కవర్ అయిపోయేవి.

ప్లస్ పాయింట్స్:

  • సమంత
  • అల్లు అర్హ

మైనస్ పాయింట్స్:

  • ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
  • క్లైమాక్స్
  • విఎఫ్ఎక్స్

విశ్లేషణ:

శాకుంతలం అనేది పౌరాణిక బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఒక లవ్ డ్రామా. కొన్ని మంచి పెర్ఫార్మన్స్ లు ప్లస్ కాగా ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, విఎఫ్ఎక్స్ కచ్చితంగా మైనస్ అనే చెప్పాలి.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...