‘ఎన్.టి.ఆర్’ బయోపిక్ రిజల్ట్ నుంచి కోలుకున్న నందమూరి బాలకృష్ణ మళ్ళీ సినిమాలు చేయడంలో తన జోరు పెంచాడు. అంతే కాకుండా తన వెయిట్ చాలా తగ్గించుకొని సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో చేస్తున్న 105వ సినిమా ‘రూలర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నవంబర్ చివరికల్లా షూటింగ్ పూర్తిచేసి డిసెంబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
ఇది అయిన వెంటనే ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్న సంగతి ఇది వరకే తెలిపాము. క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసి సినిమాపై అంచనాలు పెంచడంలో బోయపాటి దిట్ట అని చెప్పాలి. ఇప్పటి వరకూ తెరపై సెట్ చేసిన హీరో – విలన్ కాంబినేషన్స్ అన్నీ బ్లాక్ బస్టర్స్. అదే పంథాలో బాలకృష్ణ మూవీ కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరో అయిన సంజయ్ దత్ ని రంగంలోకి దించనున్నాడు.
ఇప్పటికే బోయపాటి శ్రీను సంజయ్ దత్ ని కలిసి కథ మరియు ఆయన పాత్ర చెప్పగా ఆయన కూడా చాలా సుముఖంగా ఉన్నారట. త్వరలోనే ఆయన తన ఫైనల్ డెషిషన్ చెప్పనున్నారట. ఆన్ స్క్రీన్ బాలకృష్ణ – సంజయ్ దత్ అంటే ఆ కాంబినేషన్ ఊహే అభిమానులకి ఫుల్ జోష్ ఇస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో సంజయ్ దత్ నటుడిగా తనని తాను కొత్తగా మార్చుకుంటూ, అన్ని భాషల్లో సినిమాలు చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ‘కెజిఎఫ్ 2’ లో మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్న బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండబోయే ఈ సినిమాని మిర్యాల రవీందర్ నిర్మించనున్నారు.
624111 686318I feel other internet site owners should take this website as an model, very clean and superb user genial design and style . 18498
980736 852773The Case For HIIT Cardio – Why You must Concider it By the way you may want to have a look at this cool site I found 503745