సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయిన సమంత నుండి వస్తోన్న లేటెస్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ శాకుంతలం. ఈ సినిమా పట్ల సమంత కాన్ఫిడెంట్ గా ఉంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది సమంత. ఆ సందర్భంగా సమంత, సీతా రామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ లమధ్య నడిచిన ఆసక్తికర చాట్ ఇప్పుడు చూద్దాం.
మొదట మృణాల్ ఠాకూర్, “నువ్వు చాలా స్ఫూర్తిదాయకం సామ్. మనిద్దరం ఎప్పుడు కలిసి నటిద్దాం” అని అడిగింది సమంత.
దీనికి సమంత నుండి సమాధానం వచ్చింది కూడా. “తప్పకుండా చేద్దాం. నాకు ఆ ఐడియా నచ్చింది” అని చెప్పుకొచ్చింది సమంత.
మరి నిజంగా ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి నటిస్తే అది చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.