Sai Dharan Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharan Tej) తన పేరు మార్చుకున్నారు. తన మాతృమూర్తి పేరులోని దుర్గను జోడించి ‘సాయి దుర్గా తేజ్’ (Sai Durga Tej:)గా మార్చుకున్నారు. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో కలర్స్ స్వాతితో కలిసి నటించిన మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ ‘సత్య’. సత్య షార్ట్ ఫిల్మ్ అంతర్జాతీయ స్థాయిలో టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్ లో పలు అవార్డులు గెలుచుకుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో ఆయన ఈ విషయం తెలియజేశారు.
‘తండ్రి పేరు ఇంటి పేరుతో ఎలానూ ఉంది. అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలనే ఉద్దేశంతోనే దుర్గ పేరు జోడించుకున్నాన’ని అన్నారు. ఆమధ్య సాయి తేజ్ గా కూడా పలు సినిమాల్లో పేరు కనిపించింది. గాంజా శంకర్ ఆగిపోయిందనే వార్తలపై స్పందిస్తూ.. నేనూ ఆ వార్తలు చదివాను. నాకైతే తెలీదని వ్యంగ్యంగా చెప్పారు. రామ్ చరణ్ తో నటించే విషయంపై మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్, నాగబాబుగారితో నటించాను. ఇప్పుడు చిరంజీవి మావయ్యతో నటించడమే గోల్. తర్వాత మెగా హీరోలతో నటిస్తా’నన్నారు.