ఆర్ ఆర్ ఆర్ .. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం. బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ క్రేజీ హీరోలు ఎన్టీఆర్, చరణ్ లు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ ఫారెస్ట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా విడుదల డేట్ మారిందంటూ జరుగుతున్నా ప్రచారానికి తేరా తీస్తూ .. టీమ్ కొత్త విడుదల డేట్ ను ప్రకటించింది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా 2021 జనవరి 8న విడుదల చేస్తున్నట్టు తాజాగా టీమ్ ప్రకటించడం విశేషం.
ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అప్పుడే బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. పలు ఏరియాల కోసం భారీగా ఆఫర్స్ వస్తున్నాయట. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దాదాపు పది భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా నైజాం ఏరియా హక్కుల కోసం గట్టి పోటీ నెలకొన్నదట, ఈ హక్కుల కోసం గట్టి పోటీ మధ్య ప్రముఖ నిర్మాత దిల్ రాజు హక్కులు సొంతం చేసుకున్నాడట. ఇందుకోసం అయన ఏకంగా 85 కోట్లకు పైగానే వెచ్చించినట్టు టాక్. అయితే ఈ హక్కుల కోసం వందకోట్ల వరకు అఫర్ పలికిందని ట్రేడ్ టాక్.
డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకోసం ఏకంగా 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ల కల్పిక కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా , చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది. అజయ్ దేవగన్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇక హిందీ, తమిళ హక్కుల కోసం కూడా భారీ కాంపిటీషన్ నడుస్తుంది.
949112 273702I feel 1 of your advertisements triggered my internet browser to resize, you may want to put that on your blacklist. 136026
938764 207164bless you with regard towards the specific weblog post ive genuinely been searching with regard to this kind of advice on the net for sum time these days hence with thanks 995859
885793 194563You must take part in a contest for among the best blogs on the internet. I will suggest this web site! 857138