జబర్దస్త్ జంట రాకింగ్ రాకేష్, సుజాతల వివాహ నిశ్చితార్ధ వేడుక నిన్న ఘనంగా జరిగింది. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెల్సిందే. సాంప్రదాయ దుస్తుల్లో దంపుతులు చూడముచ్చటగా ఉన్నారు. ఈ వేడుకకు జబర్దస్త్ ఆర్టిస్ట్ లతో పాటు బుల్లితెర నటీనటులు, మీడియా వ్యక్తులు కూడా హాజరయ్యారు.
ఇక ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి, జబర్దస్త్ మాజీ జడ్జ్ రోజా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై దంపతులను ఆశీర్వదించారు. వారితో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
జబర్దస్త్ లో మాములు ఆర్టిస్ట్ గా మొదలైన రాకేష్ ప్రయాణం తర్వాత టీమ్ లీడర్ గా మారడం, ఆపై సినిమా అవకాశాలు రావడం జరిగాయి. ఇదిలా ఉంటే సుజాత న్యూస్ యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టి బిగ్ బాస్ లోకి వెళ్లి ఇప్పుడు జబర్దస్త్ లో రాకేష్ టీమ్ లో చేస్తోంది.