Switch to English

ఆఫ్ట్రాల్ రోజా.! శతకోటి లింగాల్లో బోడి లింగం: రాయపాటి అరుణ

రోజా రెడ్డి అలియాస్ రోజా సెల్వమణి.. సినీ నటి మాత్రమే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. పైగా, ఆమె మంత్రి కూడా. కానీ, ‘ఆఫ్ట్రాల్ రోజా.. శతకోటి లింగాల్లో బోడి లింగం..’ అంటూ రోజాపై విమర్శల తూటాలు పేల్చేశారు జనసేన మహిళా నాయకురాలు రాయపాటి అరుణ.

గత కొంతకాలంగా జనసేన పార్టీలో మహిళా విభాగం తరఫున అత్యంత బలంగా వినిపిస్తోన్న వాయిస్ రాయపాటి అరుణదే. రాజకీయ ప్రత్యర్థులు జనసేన పార్టీ మీద చేసే విమర్శల్ని తిప్పి కొట్టడంలో, రాయపాటి అరుణ రూటే సెపరేటు. ఈ క్రమంలో ఆమె అధికార పార్టీ నుంచి కొన్ని బెదిరింపులు కూడా ఎదుర్కొంటున్నారు.

మొన్నీమధ్యనే రాయపాటి అరుణకు బెదిరింపులు వస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి, అధికార పార్టీకి వార్నింగ్ ఇవ్వడంతో, రాయపాటి అరుణకి క్షమాపణలు కూడా చెప్పారు వైసీపీ నేతలు. మాటల్లో స్పష్టత, విమర్శల్లో స్పష్టత.. అన్నిటికీ మించి ఎవరికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో ఆ భాషలో చెప్పడం రాయపాటి అరుణ ప్రత్యేకత.

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ లీక్ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమైన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళగా, గోరంట్ల మాధవ్ తీరుని ఖండించాల్సింది పోయి, ఆయన్ని సమర్థించారు మంత్రి రోజా. ఈ క్రమంలో ఆమె జనసేన మీద విమర్శలు చేస్తూ, ‘పిల్ల యెదవలు’ అంటూ నోరు జారేశారు.

దాంతో, రాయపాటి అరుణ స్పందించాల్సి వచ్చింది. ‘ఆఫ్ట్రాల్ రోజా..’ అనేశారు రాయపాటి అరుణ. ‘బోడి లింగం’ అని కూడా ఎద్దేవా చేశారు. ‘ఇంకోసారి పిల్ల యెదవలు అనే ముందు నీ బతుకేంటో ఆలోచించుకుంటే మంచిది..’ అని ఉచిత సలహా కూడా ఇచ్చారు రాయపాటి అరుణ. ‘లెగిస్తే, నోరు తెరిస్తే.. పవన్ కళ్యాణ్, జనసైనికులు, జనసేన పార్టీ.. ఈ మూడింటి మీద ఏడవడంతోనే సరిపోతోంది మీ బతుకులకి.. వున్న పదవుల్ని సంతోషంగా అనుభవించలేరు.. రాష్ట్రానికి మీ వల్ల జరిగిన ఉపయోగం ఏమీ లేదు.. పరమ చెత్త బ్యాచ్..’’ అంటూ రాయపాటి అరుణ వ్యాఖ్యానించారు.

‘టీడీపీలో వున్నప్పుడు వైఎస్సార్ మీదా, వైఎస్ జగన్ మీదా గబ్బు నోరేసుకుని గబ్బు గబ్బు మాటలు మాట్లాడిన నువ్వు.. మంత్రి పదవి ఇవ్వకపోతే మళ్ళీ అలా తిడతావేమోనని నీకు పదవి ఇచ్చారు తప్ప, నీ సమర్థతని చూసి కాదు..’ అంటూ ఎద్దేవా చేశారు రాయపాటి అరుణ.

మంత్రి రోజాని పట్టుకుని జనసేన మహిళానేత రాయపాటి అరుణ మరీ ఇలాగనేశారేంటబ్బా.? ఫాఫం రోజా.. కౌంటర్ ఎటాక్ ఇచ్చే పరిస్థితుల్లో వుంటారంటారా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి...

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్‌ని హత్య చేసింది చంద్రబాబు, రామోజీ!

ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పెట్టడం రాజకీయ దుమారం రేపుతుంది. తెలుగు దేశం పార్టీ నాయకులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఈ...

వయసు పెరిగే కొద్ది స్కిన్‌ షో పెంచుతున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా సినీ కెరియర్ ఆరంభం అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మ ఆఫర్ల విషయంలో కాస్త వెనుకబడిందని చెప్పాలి. చిన్నా చితికా సినిమాల్లో వెబ్ సిరీస్...

రూపాయి బాగానే వుందా.? కేంద్రం బుకాయింపులు దేనికోసం.?

డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ రోజు రోజుకీ అత్యంత దయనీయంగా మారుతోంది. 80 రూపాయల మార్క్ దాటేసి, 85 రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. అయితే, 85కి చేరడానికి చాలా టైమ్...

కండోమ్స్ కూడా ఫ్రీ ఇవ్వాలా.. విద్యార్థినులతో ఐఏఎస్ ఆఫీసర్‌ దారుణ వ్యాఖ్యలు

బీహార్ కి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని హర్‌జోత్ కౌర్‌ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తో అమ్మాయిలు ప్రభుత్వం ఉచితంగా సానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి...

మరోసారి హాస్పిటల్ లో దీపికా… దేనికోసం?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఎప్పుడూ టాప్ చిత్రాలతో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో ప్రాజెక్ట్ కె లో దీపికా హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. ప్రాజెక్ట్ కె...