Switch to English

మాజీ బాయ్ ఫ్రెండ్ తో రష్మిక రొమాన్స్..!?

రష్మిక మండన్న .. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇప్పటికే గోల్డెన్ లెగ్ గా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ భామ రష్మిక మండన్న వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ రేసులో ఉంది. చలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా నితిన్ సరసన నటించిన భీష్మ తో మరో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న రష్మిక కు మరో క్రేజీ అవకాశం వచ్చిందట.

అదేమిటంటే .. ఈ మధ్య రష్మిక కన్నడ హీరో రోహిత్ శెట్టి తో ప్రేమాయణం సాగించింది, ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు, దానికోసం ఎంగేజిమెంట్ కూడా ఫిక్స్ అయింది .. కానీ ఇంతలో ఏమైందో ఏమో .. ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం .. రష్మిక తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోవడం జరిగింది. అయినా ఆ విషయాలు పెద్దగా పట్టించుకోకుండా రష్మిక మాత్రం తన సినిమాలతో బిజీగా ఉంది. మరో వైపు రష్మిక లవర్ కూడా హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ మద్యే అతడే శ్రీమన్నారాయణ అంటూ ఓ పాన్ ఇండియా సినిమా చేసి దెబ్బ తిన్న రోహిత్ శెట్టి .. తనను హీరోగా నిలబెట్టిన కిట్టి పార్టీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు , కిట్టి పార్టీ సినిమాతోనే రోహిత్, రష్మిక జోడి కలిసి నటించడం, ఆ షూటింగ్ లోనే ప్రేమలో పడడం జరిగిపోయాయి.

మరి రోహిత్ శెట్టి కిట్టి పార్టీ 2 కి ప్లాన్ చేస్తున్నాడు .. ఈ సినిమాలో రష్మిక ను హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి మాజీ లవర్ తో రష్మిక రొమాన్స్ కు ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కాస్ట్‌ కట్టింగ్‌ తప్పదా?

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు. ఈగతో సినిమా తీసినా కూడా దానికి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఘనత రాజమౌళికి...

పవన్‌ ఆ రెండు సినిమాలు ఈ ఏడాది చేయడేమో!

అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ కొన్నాళ్ల క్రితం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కెరీర్‌లో...

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల...

కరోనాతో అల్లు వారి ‘ఆహా’లో ఢొల్ల బయటపడినది

రాబోయే రోజుల్లో ఓటీటీ రాజ్యం ఏళబోతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఓటీటీ బిజినెస్‌ చాలా లాభసాటిగా ఉంది. ఇండియాలో...

#AA20 అప్‌డేట్‌ ఇవ్వకుంటే ఊరుకునేలా లేరుగా

అల్లు అర్జున్‌ 20వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రంగస్థలం చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో చాలా కసిగా ఉన్న...

రాజకీయం

జగన్‌ సారూ.. కరోనా ప్రాణం తీసింది చూడూ.!

‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా వైరస్‌ నయమైపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ తగ్గిపోతుంది..’ అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనా...

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని పవన్‌ ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడమేంటి.?

జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత...

బోయింగ్ కు కరోనా సెగ: లేఆఫ్ దిశగా…

యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా...

ఎక్కువ చదివినవి

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి...

రౌడీ స్టార్‌కు ఫ్యాన్స్‌ బాసట

టాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు కరోనా విపత్తు నేపథ్యంలో లక్షలు.. కోట్ల విరాళంను తమకు తోచినంతగా ఇచ్చిన విషయం తెల్సిందే. పలువురు టాలీవుడ్‌ స్టార్స్‌ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రధాన మంత్రి సహాయ నిధికి...

బాధ్యతారాహిత్యం: కరోనాపై గెలిచి.. అంతలోనే షేక్‌ హ్యాండ్‌.!

ఓ యువకుడు కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనా వైరస్‌ సోకితే మరణమేనన్న అపోహల నుంచి బయటకు రావాలనీ, కరోనా లక్షణాలు ఎవరికైనా వుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలనీ, మన వైద్యులు...

పూజ హెగ్డేకి మరో  బంపర్ ఆఫర్.!

సక్సెస్ ని బట్టి హీరో/ హీరోయిన్ రేంజ్ రాత్రికి రాత్రి మారిపోతుంది. అలా ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ పూజ హెగ్డే. ఇటు...

అభిజ్ఞ చెప్పినట్టే జరుగుతోంది!

ప్రపంచంలో పెను విపత్తు జరగబోతోందంటూ కరోనా మహమ్మారి వెలుగుచూడటానికి ఏడు నెలల ముందు అభిజ్ఞా ఆనంద్ అనే 14 ఏళ్ల బాల మేధావి చెప్పినట్టే ప్రస్తుతం జరగడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. గతేడాది ఆగస్టు...