Switch to English

సిగ్గు సిగ్గు: విశాఖలో ‘నయా’ నిస్సిగ్గు రాజకీయం.!

కొన్నాళ్ళ క్రితం అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని విశాఖ విమానాశ్రయంలోనే నిర్బంధించారు. అది ప్రత్యేక హోదా కోసం ఉద్యమం గట్టిగా జరుగుతున్న సమయంలో. ఇప్పుడు విశాఖ విమానాశ్రయం దగ్గరే ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి చుక్కలు చూపిస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. అప్పుడూ ఇప్పుడూ అదే పోలీసులు. ఏది న్యాయం.? ఏది అన్యాయం.?

ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళితే ప్రభుత్వానికి ఎందుకంత భయం.? అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. కానీ, ‘భయం’ మాత్రం అదే.! కనీ వినీ ఎరుగని స్థాయిలో విశాఖ విమానాశ్రయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 500 నుంచి 1000 రూపాయలు వెచ్చించి మరీ కిరాయి రౌడీల్ని అధికార పార్టీ తీసుకొచ్చిందనే విమర్శలు టీడీపీ నుంచి ఎదురవుతుండడం గమనార్హం. ‘పెయిడ్‌ ఆర్టిస్టులు..’ అనే మాట టీడీపీ నోట విన్పిస్తోంది. కానీ, ఇది ప్రజాస్వామిక నిరసన.. అని అధికార పార్టీ చెబుతోంది. ఏది నిజం.?

అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తోంటే.. అక్కడ ‘పెయిడ్‌ ఆర్టిస్టులు’ ప్రభుత్వానికి కన్పించారు. సాధారణ రైతులపై పోలీసులు లారీలు ఝుళిపించారక్కడ. కానీ, విశాఖలో విమానాశ్రయం దగ్గర.. వైసీపీ కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిన్నా పోలీసులు చూస్తూ ఊరుకుండిపోయారు. పైగా, పోలీసులే వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నది టీడీపీ ఆరోపణ. ఎవరి వాదనలు వారివే. ఒక్కటి మాత్రం నిజం. ఇరు పార్టీలూ కలిసి ప్రశాంతతకు మారు పేరైన విశాఖపట్నం నగరాన్ని రావణ కాష్టంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

చంద్రబాబు టూర్‌కి అనుమతిస్తే, ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి.? నాలుగు రాజకీయ విమర్శలు చంద్రబాబు చేయడం తప్ప.. అంతకు మించి జరిగేదేమీ వుండదు. ఆ విషయం వైసీపీ ప్రభుత్వానికి తెలియదని అనుకోలేం. కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి విశాఖ కేంద్రంగా. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను గుర్తించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇక్కడ ఆందోళనలకు ఆస్కారమివ్వకూడదు మామూలుగా అయితే. కానీ, తమ పార్టీ కార్యకర్తల్ని, ప్రతిపక్షం పైకి వైసీపీ ఉసిగొల్పిందంటేనే.. విశాఖపై ఆ పార్టీకి వున్న చిత్తశుద్ధి ఏంటన్నది అర్థమవుతోంది.

విశాఖ ప్రజలు తాజా పరిణామాల్ని విశ్లేషించుకోవాలి. వైసీపీతోపాటు టీడీపీ రాజకీయ డ్రామాల్నీ అర్థం చేసుకోవాలి.

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

ఇకపై మాస్క్‌ లేకుంటే క్రిమినల్‌ కేసులే

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే బెంగళూరులో...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

‘రఘురామ’ డ్యామేజీని.. రాపాకతో పూడ్చుతున్నారా.?

నర్సాపురం వైసీపీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ) ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో సొంత పార్టీ నేతల అత్యుత్సాహం.. పార్టీ కొంప ముంచిందన్నది నిర్వివాదాంశం. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై రఘురామకృష్ణరాజు...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

కరోనా అలర్ట్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. పోటాపోటీ.?

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది. చిన్న తేడా ఏంటంటే.. తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో చాలా...