ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది కన్నడ భామ రష్మిక మండన. ఆ సినిమా తరువాత రౌడీ హీరోతో గీత గోవిందం సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. ప్రస్తుతం రష్మిక అంటే టాలీవుడ్ లో హాట్ క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రశ్మికను ఓ దర్శకుడు ఏడిపించాడట ? ఈ విషయాన్నీ ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది ?
ఏంటి ? రష్మిక కు అలాంటి చేదు అనుభవం ఎదురైందా ! బాబోయ్ .. కాస్టింగ్ కౌచ్ మాములుగా లేదు? ఇంకా మార్పులు రాలేదా ? అని షాక్ అవ్వకండి. ఇక్కడ మీరు అనుకుంటున్నది ఏమి జరగ లేదు !! అసలు విషయం ఏమిటంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడుతూ .. గీత గోవిందం సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకుంది. ఒకరోజు షూటింగ్ లొకేషన్ కు తాను ఆలస్యంగా వెళ్లానని, ఆ యూనిట్ లోని మెంబర్స్ ఎవరు తనతో సరిగ్గా మాట్లాడలేదట. అలా అందరు తనను అవాయిడ్ చేయడంతో ఎం జరిగిందో అర్థం కాలేదట.. చాలా ఇబ్బందిగా అనిపించి కన్నీరు పెట్టుకున్నానని తెలిపింది. కాసేపటి తరువాత దర్శకుడు పరశురామ్ వచ్చి అసలు విషయం చెప్పడంతో తేరుకున్నానని చెప్పింది.
ఇంతకీ దర్శకుడు ఏమి చెప్పాడో తెలుసా .. రష్మిక సహజంగా బాధపడుతున్నప్పుడు ఉండే హావభావాలను కెమెరాలో బంధించేందుకు ఇలా ప్లాన్ చేశామని చెప్పాడట దర్శకుడు !! కావాలనే ఇలా అందరం ఆట పట్టించామని చావు కబురు చల్లగా చెప్పాడట.. పరశురామ్ పైకి కనిపించడు కానీ మహా అల్లరోడు కదా ! నిజంగా రష్మికను ఏడిపించిన దర్శకుడు ఆమెనుండి గొప్ప నటనను రాబట్టే ప్రయత్నం చేసాడన్నమాట. మరి ఆ సన్నివేశాలు ఏవో కూడా చెప్పివుంటే .. ఆ సినిమాను మరోసారి చూస్తారేమో ప్రేక్షకులు.
