మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పానుమ్ కొషియుమ్’ రీమేక్ గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు ప్రముఖంగా వస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు నటించాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం వీరు స్క్రిప్ట్ వర్క్ చేయిస్తూనే మరో వైపు హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది,
మలయాళ వర్షన్ చూసిన రానా చాలా ఇంప్రెస్ అయ్యాడని తప్పకుండా నటించాలనే అభిప్రాయంకు వచ్చాడట. అయితే పృథ్వీరాజ్ పోషించిన పాత్ర బాలకృష్ణకు అయితే బాగా సూట్ అవుతుందని భావిస్తున్న నేపథ్యంలో బాలయ్య వద్ద మంచి సన్నిహిత్యం ఉన్న రానా ప్రస్తుతం ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. రానా ఇంకా బాలయ్యలు గతంలో పలు వేదికల మీద సరదాగా మాట్లాడుకోవడం ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం మనం చూశాం. అందుకే రానా ప్రయత్నిస్తుంటే బాలయ్య ఓకే చెప్తాడేమో అనిపిస్తుంది.
ప్రస్తుతం రానా ఇంకా బాలయ్యలు ఇద్దరు కూడా వారి వారి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. చెరో రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆ సినిమాలు ఈ ఏడాది చివరి వరకు పూర్తి అయినా వచ్చే ఏడాదిలో ఈ రీమేక్ చేయాలని రానా భావిస్తున్నాడట. రానా కాస్త సీరియస్‌గా ప్రయత్నిస్తే బాలయ్య ఒప్పుకోకుండా ఏమీ ఉండదు. గతంలో మంచు మనోజ్ సినిమాలో బాలయ్య నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు రానాతో కూడా నటిస్తాడేమో చూడాలి.
987290 880757This write-up contains fantastic original thinking. The informational content here proves that things arent so black and white. I feel smarter from just reading this. 179618
231033 14882Hiya! awesome weblog! I happen to be a everyday visitor to your website (somewhat a lot more like addict ) of this internet site. Just wanted to say I appreciate your blogs and am looking forward for far more to come! 129243
215544 467441Maintain up the wonderful piece of function, I read few posts on this internet web site and I believe that your web weblog is genuinely interesting and contains lots of superb information. 428769