Switch to English

ప్రెగ్నెన్సీ టెస్టుకు వెళ్తే కరోనా అంట కట్టారట

బాలీవుడ్‌ బ్యూటీ రాధిక ఆప్టే కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉందంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాతో పాటు ఒకటి రెండు జాతీయ మీడియాల్లో కూడా ప్రచారం జరిగింది. అందుకు కారణం తాజాగా రాధిక ఆప్టే మాస్క్‌ పెట్టుకుని ఉన్న ఒక ఫొటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అవ్వడం. అది కూడా ఒక హాస్పిటల్‌ అవ్వడంతో అంతా కూడా ఆమె ఐసోలేషన్‌లో ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

మీడియాలో తన గురించి వస్తున్న విపరీతమైన ప్రచారం నేపథ్యంలో రాధిక ఆప్టే స్పందించింది. తాను స్నేహితురాలి ప్రెగ్నెన్సీ చెకప్‌ కోసం తోడుగా వెళ్లాను. ఆమె నెల నెల చెకప్‌లో భాగంగా వెళ్తున్న సమయంలో తోడుగా వెళ్లాను అంతే తప్ప నా కోసం కాదు. అంత మాత్రానికే నన్ను కరోనా పాజిటివ్‌గా మార్చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. మీడియాకు స్వీయ నియంత్రణ లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రముఖ స్టార్స్‌ కరోనా భయంతో క్వారెంటైన్‌కు వెళ్తున్న ఈ సమయంలో రాధిక ఆప్టే దేశ విదేశాలు చక్కర్లు కొడుతుంది కనుక ఆమెకు ఏమైనా కరోనా పాజిటివ్‌ తేలిందేమో అనుకున్నామని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం హిందీల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రాధిక ఆప్టే ఒక హాలీవుడ్‌ సినిమాలో కూడా నటించి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో రాధిక పూర్తి నగ్నంగా నటించడం, ఆ సీన్స్‌ లీక్‌ అవ్వడంతో ఆ సమయంలో కూడా రాధిక ఆప్టే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇప్పుడు మరోసారి కరోనా కారణంగా వైరల్‌ అయ్యింది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

నిర్మాతల మండలి స్పెషల్ రిక్వెస్ట్ ని సీఎం జగన్ మన్నిస్తాడా.?

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి...

‘కరోనా’ కేవలం ప్రారంభం మాత్రమే.!

అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ నేపధ్యంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ నిన్న ఆ చిత్రానికి సంబంధించిన...

మహిళలా మజాకానా.. బాత్రూంలో దాక్కున్న ఎంపీడీఓ.!

మాములుగా ఇంట్లో భార్యకి కోపమొస్తేనే తట్టుకోలేం అని పలు సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది తమ గోడు వినిపించుకోని అధికారిపై 100 మంది మహిళలు ఒకేసారి వస్తే ఎంతటి వారైనా పారిపోవాల్సిందే. అలాంటి...

చైనాలో శతాబ్దాల నాటి సంప్రదాయానికి కరోనా చెక్

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్.. మానవుల జీవన సరళిలో అనేక మార్పులు తెచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చేసింది. భౌతికదూరం అనే కొత్త కాన్సెప్టును పరిచయం చేసింది. ప్రతి విషయంలోనూ పెను...

మహేష్ హీరోయిన్ విషయంలో వెనక్కి తగ్గారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న 27వ చిత్ర వివరాలు ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వెల్లడయ్యాయి. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సర్కారు వారి పాట అనే...