Switch to English

జనసేనాని పవన్‌ ‘వర్క్‌ ఫ్రమ్ హోమ్’ అదిరింది.!

నిన్న తమిళనాడు ప్రభుత్వం.. ఇప్పుడేమో మహారాష్ట్ర ప్రభుత్వం.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రం విధించిన ‘లాక్‌ డౌన్‌’ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగువారి యోగ క్షేమాలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. ఇదంతా వర్క్‌ ఫ్రమ్ హోమ్ ప్రాతిపదికన కావడం గమనార్హం. నిజానికి, పవన్‌ కళ్యాణ్‌ ఏమీ అధికారంలో లేరు.

కానీ, ప్రజల పట్ల ఆయనకు అంకిత భావం వుంది. ‘నాకు ఓట్లేయలేదు.. నా పార్టీని గెలిపించలేదు..’ అనే ఆలోచనతో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు. తనకు చేతనైనంత సాయం ప్రజలకు చేయాలనే అనుకుంటారు ఆయనెప్పుడూ. ఇప్పుడూ అదే చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.. వ్యక్తిగతంగా తనకున్న పరిచయాలు ఉపయోగించుకుని, ఆయా ప్రభుత్వాలతో మంతనాలు జరుపుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ చూపుతున్న చొరవ పట్ల ఆయా రాష్ట్రాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. తాము స్పందించిన విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌కి చేరవేస్తూనే, పవన్‌ చొరవని అభినందిస్తున్నాయి ఆయా రాష్ట్రాలు. బాధిత ప్రజానీకం, పవన్‌ కళ్యాణ్‌ తమ పట్ల చూపుతున్న శ్రద్ధ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం, జనసేనాని విజ్ఞప్తితో, మహారాష్ట్రలో చిక్కుకుపోయిన తెలుగువారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించింది. వారికి అన్ని విధాలా అండదండలు అందిస్తామని పవన్‌ కళ్యాణ్‌కి సమాచారమిచ్చింది. ‘ఇదీ వర్క్‌ ఫ్రమ్ హోమ్ అంటే..’ అంటూ జనసైనికులు, తమ అభిమాన నాయకుడ్ని ఆకాశానికెత్తేస్తున్నారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే, కష్టం ఎక్కడున్నా.. ఆ కష్టంపై స్పందించడానికి అందరికంటే ముందుంటారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అని ఇంకోసారి నిరూపితమయ్యింది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

కరోనాకి అన్ లాక్.. కేసులు పైపైకి..!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కాలంలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. జాన్ బీ.. జహాన్ బీ అనే నినాదంతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు లాక్ డౌన్...

జస్ట్‌ ఆస్కింగ్‌: రాజకీయాల్లో ఓడితే ఇంట్లో కూర్చోవాల్సిందేనా.!

రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజం. అర శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన పార్టీలుంటాయి. ‘మీకూ మాకు వచ్చిన ఓట్ల శాతంలో తేడా ఎంతో తెలుసా.? చాలా చాలా తక్కువ.! మీదేమీ గొప్ప విజయం...

సినిమా ఇండస్ట్రీ బాలకృష్ణను పట్టించుకోలేదట

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటూ నందమూరి బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్‌తో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన చిరంజీవి బృందం వెళ్లి...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ చేసిన కామెంట్స్ దగ్గర స్టార్ట్ అయ్యింది....

విజయ్ సినిమాకు 20 కోట్ల నష్టం.. నిజమెంత?

తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరో ఎవరంటే కచ్చితంగా విజయ్ పేరు ముందు వినిపిస్తుంది. రీసెంట్ గా కూడా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్యన ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగేది కానీ...