Switch to English

Janasena: ఆవిర్భావ దినోత్సవం.! జనసేన సాధించిందేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

Janasena: జనసేన పార్టీ(Janasena) ఆవిర్భావ దినోత్సవ వేడుకలకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మచిలీపట్నం ఇందుకు వేదిక కానుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనంపైకెక్కి.. సభా ప్రాంగణానికి చేరుకుంటారట. దీనికోసం కనీ వినీ ఎరుగని స్థాయిలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

2014 ఎన్నికల సమయంలో ప్రారంభమైంది జనసేన ప్రస్తానం.! రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయ్. దశాబ్ద కాలం పూర్తి కానుంది త్వరలో.! మరి, ఇన్నేళ్ళలో జనసేన పార్టీ సాధించిందేంటి.? ఒకే ఒక్క ఎమ్మెల్యే.. ఆయనా పార్టీ మారిపోయారెప్పుడో.! 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినా, 10 శాతం కూడా ఓటు బ్యాంకు తెచ్చుకోలేకపోయింది. అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు.

అసలు రాజకీయాల్లో గెలుపంటే ఏంటి.? రాజకీయమంటే ప్రజా సేవ.! ఆ సేవలో గెలవడమే ముఖ్యమైతే.. పవన్ కళ్యాణ్ ఎప్పుడో గెలిచేశారు. కౌలు రైతుల కుటుంబాలు రోడ్డున పడితే, ఆయా కుటుంబాల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ‘కష్టం’ అని ఎవరు తన దగ్గరకు వచ్చినా, వారిని ఆదుకుంటూనే వున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ‘రెండు చోట్లా ఓడిపోయిన’ పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తున్నారంటే, ఆయనలో వాళ్ళంతా నాయకుడ్ని చూస్తున్నట్లే కదా.? మరి, జనసేనాని ఓడిపోయారని ఎలా అనగలం.?

ఎన్నికల్లో ఓట్లను కరెన్సీతో కొనగలగడమే గెలుపు.. అయితే, ఆ గెలుపుని జనసేన కోరుకోవడంలేదు. అక్కడే వస్తోంది అసలు సమస్య. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో నెంబర్ గేమ్ అనేది గెలుపోటముల్ని శాసిస్తోంది. ఆ నెంబర్ గేమ్‌లో నెగ్గాలంటే అడ్డదారులు తొక్కాల్సిందే.

ఔను, అడ్డదారులు తొక్కకపోవడమే జనసేన పార్టీ నిఖార్సయిన గెలుపు.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ‘మేం, ప్రజల్ని ప్రలోభపెట్టకుండా, ఓట్లను కరెన్సీతో కొనకుండా రాజకీయం చేశాం.. ఇదీ మా గెలుపు..’ అని జనసేన గర్వంగా చెప్పుకోగలదన్నది జనసైనికుల వాదన.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...