కరోనా మహమ్మారి మానవాళి మీద భారీగా దాడి చేసింది.. దాన్ని ఎదుర్కోవడానికి మెడిసిన్ లేకపోవడంతో ఎవరికీ వారు లాక్ డౌన్ లో ఉండాల్సి వచ్చింది. ఈ లాక్ డౌన్ కారణంగా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి, అలానే సినిమా షూటింగ్స్, రిలీజ్ డేట్స్ అన్నీ తారుమారైపోయాయి. ప్రస్తుతం షూటింగ్స్ ఎప్పటి నుంచీ మొదలవుతాయి, ప్లానింగ్ లో ఉన్న సినిమాల న్యూ రిలీజ్ డేట్స్ ఏంటి అనే దానిపై క్లారిటీ లేదు.
అనుకున్న దానికంటే ఎక్కువగానే లాక్ డౌన్ పీరియడ్ కొనసాగడం వల్ల 2021 సంక్రాంతికి అనుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సమ్మర్ కి వాయిదా పడనుందని సమాచారం. దాంతో మెగాస్టార్ చిరంజీవి తన ‘ఆచార్య’ సినిమాని, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలని సంక్రాంతికి తీసుకురావాలని ఈ చిత్ర టీమ్స్ దాదాపు ఫిక్సయినట్లు మేము ఇది వరకే తెలిపాము. ఇప్పుడు వీరిద్దరికీ పోటీగా సూపర్ స్టార్ కూడా రంగంలోకి దిగాడు. ఆయనే మన రజినీకాంత్..
రజినీకాంత్ గత రెండేళ్లుగా సంక్రాంతి సీజన్ లో(పేట, దర్బార్) తన సినిమా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ వాయిదా పడడం వలన దీపావళికి అనుకున్న తన ‘అన్నాతే’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. రజినికేనాథ్ అంటే తెలుగులోనూ మంచి మార్కెట్ ఆయన ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అవుతోంది కావున అన్ని ప్లాన్స్ పర్ఫెక్ట్ గా జరిగితే 2021 సంక్రాంతి బరిలో చిరంజీవి – రజినీకాంత్ – పవన్ కళ్యాణ్ లు పోటీకి దిగుతారు.
543952 415219Its like you read my mind! You appear to know so considerably about this, like you wrote the book in it or something. I think which you can do with some pics to drive the message home a bit, but rather of that, this is great weblog. A great read. Ill definitely be back. 527335
14761 599687youve got an essential weblog correct here! would you wish to make some invite posts on my weblog? 856544