సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి సూపర్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రజిని దూసుకుపోతుండడం విశేషం. రజిని నటించిన లాస్ట్ సినిమా దర్బార్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయినా కూడా రజినీ తన తర్వాతి సినిమా విషయంలో స్పీడ్ గానే ఉన్నారు.
రజినీకాంత్ తన తర్వాతి చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేస్తోన్న విషయం తెల్సిందే. అన్నాతే అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మార్చ్ వరకూ ఈ చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసారు. దసరాకు విడుదల చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. అయితే అనుకోకుండా కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇవ్వడంతో షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో మళ్ళీ షూటింగ్స్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదే క్రమంలో రజిని నిర్మాతలు కూడా షూటింగ్ ను మొదలుపెట్టడానికి ఆలోచన చేస్తున్న క్రమంలో రజిని నుండి నో అన్న సమాధానం వచ్చిందట. ప్రస్తుతం కరోనా ఇంకా ఉధృతంగా ఉంది. ఈ సమయంలో షూటింగ్ కు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదంటూ రజినీ వారించారట. వచ్చే ఏడాది వరకూ ఈ సినిమా షూటింగ్ కు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. సో అప్పటివరకూ ఈ సినిమా హోల్డ్ లో ఉన్నట్లే.
127034 329577I actually delighted to locate this internet website on bing, just what I was searching for : D too saved to fav. 652687
91236 836181Aw, this was a genuinely nice post. In idea I would like to put in writing like this furthermore – taking time and actual effort to make a very good article but what can I say I procrastinate alot and by no means appear to get something done. 655449
428592 507835Hello. splendid job. I did not anticipate this. This really is a splendid story. Thanks! You created certain fine points there. I did a search on the topic matter and identified the majority of folks will have exactly the same opinion along with your blog. 744768