స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli)- సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu) కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగా రాజమౌళి సినిమా అంటే విజువల్ ట్రీట్. కథకి అనుగుణంగా ఆయన సినిమాలని రెండు భాగాలుగా తీస్తుంటారు. అలా వచ్చిన ‘బాహుబలి’ ఎంత హిట్ అయిందో తెలిసిందే. టాలీవుడ్ క్రేజ్ ని జాతీయ స్థాయిలో నిలబెట్టింది.
ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా రెండు భాగాలుగా తీయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే రాజమౌళి టీం స్టోరీ రెడీ చేసిందట. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారట. కేఎల్ నారాయణ ఈ సినిమాకి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.