యంగ్ హీరో రాజ్ తరుణ్ వివాదంలో ఇరుక్కున్నాడు. రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. అతి వేగంగా కారుని నడపడం వల్లే కారు ప్రమాదానికి గురయ్యిందన్నది ఇప్పటిదాకా విన్పిస్తోన్న కథనాల సారాంశం. అయితే, స్వయంగా రాజ్ తరుణ్ ఆ కారుని నడిపాడా.? లేదా.? అన్నదానిపై ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టతా లేదు. ప్రమాదం తర్వాత రాజ్ తరుణ్, అక్కడి నుంచి పారిపోతున్న వైనం సీసీటీవీ ఫుటేజ్లలో వెల్లడవుతోంది.
అయితే, తొలుత ఈ ఘటనతో రాజ్ తరుణ్‌కి సంబంధం లేదంటూ కొన్ని ఖండనలు వచ్చాయి. కానీ, ఇంతవరకూ ఈ ఎపిసోడ్‌పై రాజ్ తరుణ్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. మరోపక్క, పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం కారు యజమానిని విచారించే పనిలో బిజీగా వున్నారు పోలీసులు. విచారణలో కారు యజమాని చెప్పే విషయాల్ని బట్టి పోలీసులు, రాజ్ తరుణ్‌ని కూడా విచారించే అవకాశాలున్నాయి.
రాజ్ తరుణ్ అరెస్ట్ అవడం ఖాయమనీ, ఆ భయంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడనీ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి, కారు ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. కారు ప్రమాదానికి గురయ్యింది గనుక, అది నిర్లక్ష్యం కారణంగా జరిగితే, జరీమానా విధించే అవకాశాలుంటాయి. రాజ్ తరుణ్‌కి డ్రైవింగ్ లైసెన్స్ వుండదని ఎలా అనుకోగలం.?
మద్యం మత్తులో రాజ్ తరుణ్ ఆ వాహనాన్ని నడిపి వున్నా, వెంటనే పోలీసులకు చిక్కలేదు గనుక.. ఆ కోణంలో కూడా రాజ్ తరుణ్‌కి పెద్దగా సమస్యలు వుండకపోవచ్చు. అయినా, రాజ్ తరుణ్ ఈ వ్యవహారంపై ఇంత ‘సీక్రెసీ’ ఎందుకు మెయిన్‌టెయిన్ చేస్తున్నట్లు.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
68465 568511This is one really interesting post. I like the way you write and I will bookmark your blog to my favorites. 719081
832968 588340You must get involved in a contest 1st with the greatest blogs more than the internet. Ill recommend this page! 496015