సినిమా రివ్యూ: తోలు బొమ్మలాట

0
సినిమా రివ్యూ: తోలు బొమ్మలాట
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, విశ్వంత్‌, హర్షిత చౌదరి, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌..
నిర్మాత: దుర్గాప్రసాద్ మాగంటి
దర్శకత్వం: విశ్వనాథ్ మాగంటి
సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేదీ: నవంబర్ 22, 2019
రేటింగ్:1.5

నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన పూర్తి కుటుంబ కథా చిత్రం ‘తోలుబొమ్మలాట’. సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి నిర్మాతగా విశ్వనాథ్‌ మాగంటి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. కానీ మేము ఈ చిత్రాన్ని స్పెషల్ గా చూసాం. మరి ఈ ‘తోలు బొమ్మలాట’ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

సోమరాజు అలియాస్ సోడాల రాజు(రాజేంద్ర ప్రసాద్) ఊరిలో పెద్దమనిషి. ఎప్పటికప్పుడు ఊరి సమస్యలని పరిష్కరించి, కలిసి ఉంటేనే ఆనందం అని చెప్పే మనస్తత్వం. తన మనవడు మనవరాల, వరసకి బావ మరదళ్లయినా రిషి(విశ్వంత్) – వర్ష(హర్షిత చౌదరి)లు సోమరాజు దగ్గరికి వచ్చి మేము చిన్ననాటి నుంచి ప్రేమించుకుంటున్నాం, మా పెళ్లి మీరే జరిపించాలని కోరుకుంటారు. దానికి కారణం కానీ సోమరాజు కొడుకు – కుమార్తెల కుటుంబాల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండడమే. అందుకే ఆ యువ జంట తాతయ్యని అప్రోచ్ అవుతారు. దాంతో వారి పెళ్లి చేయడమే చివరి కోరిక అని ఫిక్స్ అయిన సోమరాజు ఆ కోరిక తీరకుండానే చనిపోతారు. అలా ఆత్మగా మారిన సోమరాజు తన 11వ రోజు కార్యక్రమం వరకూ ఆ ఇంట్లోనే తిరుగుతూ తన పిల్లల కుటుంబాల మధ్య ఉన్న విభేదాల్ని ఎలా తొలగించాడా?లేదా? ఆ బావ మరదళ్ల పెళ్లి చేశాడా? లేదా? ఆత్మ అయినా సోమరాజుకి సంతోష్(వెన్నెల కిషోర్) ఎలా సాయపడ్డాడు? అనేదే కథ

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ప్రధాన పాత్రలు పోషించిన నటీనటుల నటన. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌, హర్షిత చౌదరిల నటన చాలా బాగుంది. చాల చోట్ల బోర్ కొడుతున్నప్పటికీ వారి పాత్రలకి ఎంత న్యాయం చేయగలరో అంత చేయడం వలనే చూడగలుగుతాం. వెన్నెల కిషోర్ కి ఆత్మలు కనపడడం, వాటితో పెట్టే డిస్కషన్ సీన్స్ బాగున్నాయి. ఇకపోతే, వెన్నెల కిషోర్ ఇంట్రడక్షన్ సీన్, రాజేంద్ర ప్రసాద్ – వెన్నెల కిషోర్ మధ్య కొన్ని సీన్ లు మనల్ని కొంత మేర నవ్విస్తాయి. ఇకపోతే సినిమాలో పల్లెటూరి నేపథ్యంలో చూపించిన కొన్ని మోంటెజ్ సీన్స్ మనకు చిన్నప్పుడు అమ్మమ్మ – తాతయ్యలతో గడిపిన క్షణాల్ని గుర్తు చేస్తాయి.

ఆఫ్ స్క్రీన్:

సినిమాకి కథే బలం అనే లాజిక్ ప్రకారం.. సినిమా కోసం ఎంచుకున్న ప్లాట్ పాయింట్ బాగుంది, కానీ అది పూర్తి కథగా రూపొందిన విధానం బాలేదు. ఎలా అనేది నెగటివ్ పాయింట్స్ లో చెప్తా.. సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా పల్లెటూరి విజువల్స్ మరియు మోంటేజెస్ లో తన సెన్సిబిలిటీస్ బాగా కనపడతాయి. అలాగే సురేష్ బొబ్బిలి సంగీతం మరియు నేపధ్య సంగీతం చాలా బాగుంది. ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా రిచ్ గా ఉంది. అలాగే మోహన్‌.కె.తాళ్లూరి ఆర్ట్ వర్క్ పల్లెటూరికి మళ్ళీ మనకు పరిచయం చేసింది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

తోలు బొమ్మలాట’ ఇదొక కుటుంబ కథా చిత్రం.. అంటే ఎమోషనల్ కంటెంట్ స్ట్రాంగ్ గా వర్కౌట్ అవ్వాలి. కానీ ఇండియాలో ఎమోషనల్ కంటెంట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రాజేంద్ర ప్రసాద్ పాయింట్ కావచ్చు, అన్న – చెల్లెలి కుటుంబ విభేధాలు కావచ్చు, ఇటు ప్రేమ జంట మధ్య వచ్చే ఎమోషన్ కావచ్చు.. ఏదీ మన మనసుకు హత్తుకునేలా లేదు. ఎదో చెప్పారంటే చెప్పారు అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ దగ్గర సినిమా అయిపోయింది అనే ఫీలింగ్ ని కలిగించి, మళ్ళీ లెంగ్తీ ఎమోషనల్ క్లైమాక్స్ చేయడం అనేది అస్సలు వర్కౌట్ కాకపోవడం వలన చివర్లో మరింత డిజప్పాయింట్ అవుతాం. ముఖ్యంగా అక్కడ పాత్రల్లో వచ్చే మార్పు ఇది క్లైమాక్స్ చేంజ్ అవ్వాలి కాబట్టి చేంజ్ అయినట్టు ఉంటుంది తప్ప చూసే ఆడియన్స్ కి మాత్రం ఆ ఫీల్ కలగలేదు. కుటుంబ కథా చిత్రంలో స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వాల్సిన ఎమోషన్ ఈ సినిమా విషయంలో డిజాష్టర్ అయ్యిందని చెప్పాలి.

ఇకపోతే సినిమా ఎండొట్టి నుంచి చివరి దాకా చాలా స్లోగా, చాలా బోరింగ్ గా, అన్నీ మనం ఊహించినట్లుగానే జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల సన్నివేశాలు ప్రేక్షకులకి జోలపాట పాడి నిద్రలోకి పంపిన ఫీలింగ్ ని కూడా కలిగిస్తుంది. అలాగే దర్శకుడు రాసుకున్న కామెడీ 80% వర్కౌట్ అవ్వలేదు. కేవలం ఒక 20% మాత్రమే పరవాలేధనిపించింది.

ఆఫ్ స్క్రీన్:

కథ పరంగా ఇక్కడ మాట్లాడుకుంటే.. ఎంచుకున్న లైన్ మరియు నేపధ్యం బాగున్నా పూర్తి కథగా మాత్రం అంత ఎఫక్టీవ్ గా చెప్పలేకపోయారు. పైన చెప్పినట్టు నూతన దర్శకుడు విశ్వనాథ్ మాగంటి తను అనుకున్న ఎమోషన్ ని 140 నిముషాలు కథగా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. ఒక్క కథలోనే కాదు, ఆసక్తి కరంగా కథని నడిపించే కథనం విషయంలో, అలాగే దర్శకత్వంలోనూ తన ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తాయి. అలాగే డైలాగ్స్ కూడా చెప్పుకోదగినవి, మనతో పాటు, మన ఫామిలీ ఎమోషన్స్ ని దగ్గర చేసి కనెక్ట్ అయ్యేలా ఏమీ లేవు. మొదటి సినిమా విషయంలో కెప్టెన్ ఆఫ్ ది ఫిల్మ్ విషయంలో విశ్వనాథ్ మాగంటి కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. ఎడిటర్ చాలా వరకూ ట్రిమ్ చేసినా మేము చుసిన వెర్షన్ లో పెద్ద తేడా ఏమీ ఉండేది కాదు. ముఖ్యంగా చాలా అంటే చాలా ట్రాక్స్ సినిమాని నడిపించాలి కాబట్టి నడిపించినట్టు ఉంటాయే తప్ప పెద్ద ఉపయోగం ఉండదు.మెయిన్ గా యంగ్ పెయిర్ లవ్ ట్రాక్ అయితే అంతసేపు అనవసరం.

విశ్లేషణ:

‘తోలు బొమ్మలాట’ – ఓ అందమైన కుటుంబ కథా చిత్రానికి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడమే కాకుండా, రెట్రో ఫీలింగ్ ని కలిగించే పేరు. టైటిల్ అంత బాగున్నా సినిమా మాత్రం అంత బాలేదు, అలాగే అంత మంచి ఫీలింగ్ ని కూడా కలిగించలేదు. బేసిక్ స్టోరీ లైన్ తప్ప మిగతా ఏ విషయమూ ప్రేక్షకులని ఆకట్టుకోలేదు. నటీనటుల నటన బాగున్నా, చెప్పాల్సిన ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించలేకపోవడం వలన, సినిమా చూసిన ప్రేక్షకులు చాలా నీరసంతో, చెప్పాలనుకున్న పాయింట్ కూడా సరిగా చెప్పలేకపోయాడేండబ్బా అనుకుంటూ బయటకి వస్తారు. కుటుంబ కథా చిత్ర అయితే చాలు, అది ఎలా ఉన్నా మేము చొక్కాలు చించేసుకుంటాం అనే రేంజ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం ఈ సినిమా చూడచ్చు, మిగిలినవారు ఇది చదివి మీరే డిసైడ్ అవ్వండి.

ఫైనల్ పంచ్: తోలు బొమ్మలాట – త్వరగా ముగిసిపోతే బాగుండు అనిపించే ఆట.!

No posts to display