‘సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న సినిమా కాస్త ఆలస్యంగా షూటింగ్ మొదలు పెట్టుకున్నపటికీ శరవేగంగా షూటింగ్ జరుపుకొని 70% షూటింగ్ ని పూర్తి చేసుకుంది. అప్పుడే కరోనా మహమ్మారి ప్రపంచం మీద చేస్తున్న దండయాత్ర మరింత తీవ్ర స్థాయికి చేరడంతో అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా షూటింగ్ ని కూడా ఆపేసారు. ప్రస్తుతం 40 నుంచి 50 మంది టీంతో షూటింగ్ లకి పర్మిషన్స్ ఇచ్చినా షూటింగ్స్ మాత్రం ఇప్పుడప్పుడే మొదలయ్యేలా లేదు.
ఇది పక్కన పెడితే చాలా రోజులుగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్ చేయమని ప్రొడక్షన్ హౌస్ తో యుద్ధమే చేశారు. ఫైనల్ గా ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఈ చిత్ర టీం ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ముందుగా ఈ పీరియాడికల్ లవ్ స్టోరీకి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. అలాగే ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ఆంగ్లేయుల స్టైల్ కింగ్ లుక్ లో ఉంటే, పూజ హెగ్డే క్వీన్ లుక్ లో కనిపించింది. పోస్టర్ లో వీరిద్దరి పెయిర్ అండ్ కెమిస్ట్రీ చూడాటానికి చాలా బాగుంది.
ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ లో నాలుగు ఫ్లోర్లు ఉండే ఓ హాస్పిటల్ సెట్ ని నిర్మించే పనిలో ఉన్నారు. ఈ హాస్పిటల్ సెట్ కోసం అక్షరాల 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. సెట్ వర్క్ ఫినిష్ అయితే ఆగష్టులో షూటింగ్ చేసే అవకాశం ఉంది. మిగిలిన బాలన్స్ షూటింగ్ కోసం జార్జియా వెళ్లనున్నారు. అక్కడ ఓ పాట, పలు సీన్స్ తీయనున్నారు.
ఈ సినిమా 2021 సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఈ చిత్ర టీం చెబుతోంది. యువి క్రియేషన్స్ – గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ డైరెక్టర్.
351994 659733There is noticeably a lot of funds to recognize about this. I assume youve produced certain nice points in functions also. 571871
577136 918867Outstanding post, I conceive people ought to larn a good deal from this weblog its really user friendly . 916738
712711 869270I got what you mean , saved to bookmarks , very decent site. 509132
978407 573582fantastic submit, very informative. 757734
813731 882484Paris Hilton: So lovely spending time with Manny and h 938806
262304 147243fantastic post, very informative. I wonder why the other experts of this sector do not notice this. You need to continue your writing. Im positive, youve a fantastic readers base already! 763557