హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కెరియర్ ఆరంభం నుండి ఆమె ముక్కు విషయంలో అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ వచ్చింది. అందమైన బుట్ట బొమ్మకు ముక్కు షేప్ కాస్త అడ్డదిడ్డంగా ఉంది అంటూ చాలా మంది చాలా రకాలుగా గతంలో కామెంట్స్ చేశారు.
ఇప్పుడు కొత్తగా పూజ హెగ్డే తన ముక్కు షేప్ మార్చుకుంది, ఆపరేషన్ చేయించుకుంది అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూజ హెగ్డే సన్నిహితులు స్పందిస్తూ.. ముక్కుకు ఎలాంటి సర్జరీ జరగలేదని మీడియాలో.. వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా పూజ హెగ్డే నటిస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో కూడా వరుసగా నటిస్తున్న ఈ అమ్మడు ఫుల్ బిజీగా అయితే కనిపిస్తుంది.
353213 970573As I website owner I believe the content material here is very superb, thanks for your efforts. 396992