PM Modi: నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ (PM Modi) అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. ఈసారి శ్రీకృష్ణుడు పరిపాలించాడని హిందువులు బలంగా విశ్వసించే ‘ద్వారక’ (Dwaraka) నగరాన్ని వీక్షించారు. అవసరమైన సూట్, పరికరాలతో మోదీ సముద్రగర్భంలో పర్యటించడమే కాకుండా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘ద్వారకలో పూజలు చేయడం మంచి అనుభవం. ప్రార్ధనలతో కాలాతీతమైన భక్తిని.. దివ్యానుభూతిని పొందాను. శ్రీకృష్ణుడు అందరినీ కరుణిస్తాడ’ని రాసుకొచ్చారు. ఇందుకు కొన్ని ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు.
మరోవైపు.. గుజరాత్ పర్యాటక శాఖ ద్వారక సందర్శన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఓ సబ్ మెరైన్ ను ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇందుకు ముంబైలోని ప్రభుత్వరంగ సంస్థ మజగావ్ డాక్ షిప్ యార్డ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 24మంది పర్యాటకులను తీసుకెళ్లే సామర్ధ్యంతో దీనిని రూపొందిస్తున్నారు. ఇద్దరు చొప్పున పైలట్లు, డైవర్లు, టెక్నీషియన్, గైడ్ ఉంటారు. సముద్రంలో 300 అడుగుల లోతుకి తీసుకెళ్తుంది.
Prime Minister @narendramodi‘s deep sea Dwarka Darshan
The Prime Minister went underwater, in the deep sea and prayed at the site where the submerged city of #Dwarka is
📽️Catch the Glimpses! pic.twitter.com/H5Be86Gv3u
— PIB India (@PIB_India) February 25, 2024