Tollywood: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోస్ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులకు కిక్ వస్తుంది. కానీ.. ఇప్పుడు ముగ్గురూ ఒకేచోట షూటింగ్ లో ఉన్నారంటే అంతకుమించి కిక్ ఇస్తోంది. కారణం.. వారి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతున్నాయి. వారే.. రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas).
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ (Game Changer) షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం శంకర్ యాక్షన్, కీ సీన్స్ తెరకెక్కిస్తున్నారని.. తర్వాతి షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. దసరాకు సినిమా రావొచ్చని వార్తలు వస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 (Pushpa 2) షూటింగ్ లో పాల్గొంటున్నారు. సుకుమార్ ఇప్పటికే ఓ పాట చిత్రీకరించారని అంటున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఆగష్టు 15 విడుదల.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898AD (Kalki 2898 AD) షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొన్న సన్నివేశాలను నాగ్ అశ్విన్ చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. మే9 విడుదల.