Switch to English

నిమ్మగడ్డ వ్యవహారంలో ట్విస్ట్.. ఒకటి కాదు రెండు లేఖలు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం నిజమేనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. అంటే ఎస్ఈసీ నుంచి హోంశాఖకు లేఖ వెళ్లడం నూటికి నూరు శాతం నిజం. అలాగే మీడియాలో సర్క్యులేట్ అయిన లేఖ తాను రాసింది కాదంటూ ఎస్ఈసీ రమేశ్ కుమార్ చెప్పినట్టుగా ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది. అది కూడా నిజమే. అదెలా సాధ్యం అంటారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అది ఇప్పుడిప్పుడే బయట పడుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడగానే సీఎం జగన్ నుంచి మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు వరుసగా రమేశ్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఆయన తనకు ప్రాణహాని ఉందని, కేంద్రం భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. సరిగ్గా ఇక్కడే అధికార పార్టీ వ్యతిరేకులు రంగంలోకి దిగారు. నిమ్మగడ్డ రాసిన లేఖ ఇదేనంటూ మీడియా ప్రతినిధులకు దాని ప్రతులు పంపించారు. దీనిని పంపించడానికి ముందు ఓ కీలక నేత ఆయా మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడినట్టు సమాచారం.

ఈ లేఖను బాగా హైలైట్ చేయాలని సదరు నేత సూచించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఎస్ఈసీ రాసిన లేఖలో తనకు భద్రత కల్పించాలని మాత్రమే ఉండే అవకాశం ఉంది. కానీ మీడియాకు వచ్చిన లేఖలో సీఎం జగన్ తో సహా అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయ. ఆ లేఖ చూసినవారికి ఎవరికైనా ఓ సీనియర్ బ్యూరోక్రాట్ అలా రాయడమేంటి అనే సందేహం రాక మానదు. అందులో ఉపయోగించిన భాష దగ్గర నుంచి చివరకు లేఖ నెంబరు, ఎస్ఈసీ సంతకంలో కూడా తేడాలున్నాయి.

అయితే, ఈ వ్యవహారం ఎస్ఈసీకి తెలుసా లేదా అనేది ప్రస్తుతం సందిగ్ధంగా మారింది. లేఖ ఒక సెక్షన్ మీడియాలో బాగా హైలైట్ అయింది. మరుసటి రోజు పత్రికల్లో కూడా పతాక శీర్షికలో వచ్చింది. కానీ ఈ లేఖ రాసింది తానేనని ఎస్ఈసీ ఎక్కడా ధ్రువీకరించలేదు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఆయన స్పందించలేదు. మరుసటి రోజు మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లేఖ తాను రాసింది కాదని మాత్రమే చెప్పినట్టు వార్తలొచ్చాయి. అంటే ఆయన భద్రత కోరడం వాస్తవమే.

కానీ మీడియాకు విడుదల అయిన లేఖ మాత్రం ఫేక్. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే ఈ దారుణ దురాగతానికి తెరతీసినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ బయటకు వస్తే అసలు విషయం క్లియర్ గా తెలుస్తుంది. ప్రస్తుతం జగన్ సర్కారు అదే పనిలో ఉన్నట్టు సమాచారం. మీడియాకు వచ్చిన లేఖ ఫేక్ అని ఆధారాలతో సహా తేలితే సంబంధిత వ్యక్తులకు కష్టాలు తప్పకపోవచ్చనే అభిప్రాయం అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...