Switch to English

24 గంటల జనతా కర్‌ఫ్యూ: కేసీఆర్‌ అందుకే గ్రేట్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కర్నీ కలుపుకుపోయారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. చంటి పిల్లాడి నుంచి ముదుసలివరకూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారంటే, అది కేసీఆర్‌ ఉద్యమ సత్తా. ఆ ఉద్యమ నాయకుడు ఇంకోసారి తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు.

అవును, తెలంగాణ రాష్ట్రానికీ.. భారతదేశానికీ.. ఆ మాటకొస్తే, యావత్‌ ప్రపంచానికీ కరోనా ముప్పు వాటిల్లుతున్న వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ‘అవసరమైతే తెలంగాణ షట్‌ డౌన్‌ చేస్తాం.. ప్రతి ఇంటికీ రేషన్‌ అందే ఏర్పాట్లు చేస్తాం..’ అని తాజాగా కేసీఆర్‌ ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్‌ఫ్యూ చేపట్టాలని పిలుపునిస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు.. అంటే మొత్తం 24 గంటల పాటు జనతా కర్‌ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు.

‘కరోనా వైరస్‌కి ఆత్మాభిమానం ఎక్కువ.. దాన్ని వెళ్ళి పలకరిస్తే తప్ప అది మన ఇంటికి రాదు..’ అని ఈ రోజు ప్రెస్‌మీట్‌లో నవ్వులు పూయించిన కేసీఆర్‌, బయటకు వెళ్ళకపోవడం తాలూకు ప్రాముఖ్యతను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ‘ఒక్క రోజు ఇంట్లో కూర్చుంటే ప్రాణాలు పోతాయా.? భూకంపం వచ్చేస్తుందా.?’ అని ప్రశ్నించారు కేసీఆర్‌.

ప్రెస్‌మీట్‌లో అర్థం పర్థం లేని ప్రశ్నలు సంధించే జర్నలిస్టులకు ఎలా క్లాస్‌ తీసుకోవాలో అలా క్లాస్‌ తీసేసుకున్నారు. కరోనా వైరస్‌ ప్రపంచ మహమ్మారి అనీ, ఈ మహమ్మారిపై పోరాటం చేసే క్రమంలో పాలకులపై సోషల్‌ మీడియాలో సెటైర్లు వేయడం దారుణమన్న కేసీఆర్‌, అలాంటి వెకిలి వేషాలు వేసేవారిని తక్షణం అరెస్ట్‌ చేయాలని ప్రెస్‌మీట్‌లోనే పోలీస్‌ బాస్‌ని ఆదేశించడం గమనార్హం.

కరోనా వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న కేసీఆర్‌, సోకినవారికి వైద్య చికిత్స కోసం పూర్తిగా ప్రభుత్వమే ఖర్చు చేస్తుందని చెప్పారు. 5 వేల కోట్లు కాదు, అవసరమైతే 10 వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌, వైద్యుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా వుందన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాను కూడా ఇంట్లోని బాల్కనీ నుంచి బయటకు వచ్చి ‘చప్పట్లు’ కొడతానని, ప్రతి ఒక్కరూ అలాగే చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...