Switch to English

ఒక్కరోజులోనే శ్రీవారిని చూసి వచ్చేయొచ్చు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా? దర్శనం కోసం చాంతాడంత క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూడకుండా వేగంగా దర్శనం అయిపోతే ఎంతో బాగుంటుందని భావిస్తున్నారా? సెలవు దొరకడంలేదు.. ఒక్కరోజులోనే శ్రీవారిని చూసి వచ్చే అవకాశం ఉంటే సూపర్ గా ఉంటుందని అనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) సరికొత్త ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఒక్కరోజులోనే తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, శ్రీకాళహస్తి దేవాలయాలను సైతం దర్శించుకునేలా కొత్త ప్యాకేజీకి రూపకల్పన చేసింది.

విజయవాడలో తొలి రోజు రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర.. మరుసటి రోజు రాత్రి 10 గంటలకు తిరుపతిలో తిరుగు ప్రయాణమై మూడో రోజు ఉదయం విజయవాడ చేరడంతో ముగస్తుంది. అంటే, కేవలం ఒకే రోజులో ఆలయాల సందర్శన మొత్తం పూర్తవుతుందన్నమాట. తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి చూసే అవసరం లేకుండా కేవలం రెండు గంటల్లోనే శీఘ్రదర్శనం చేసుకునేలా ఏపీటీడీసీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో దిగిన తర్వాత మూడు గంటల్లోనే దర్శనం, ఇతర కార్యక్రమాలు ముగించుకుని మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యేలా షెడ్యూల్ రూపొందించింది.

విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏపీటీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం ప్రధాన పికప్ పాయింట్ కాగా.. పటమట, బెంజ్ సర్కిల్, లబ్బీపేట తదితర ప్రధాన ప్రాంతాల్లో కూడా పర్యాటకులు బస్సు ఎక్కే వెసులుబాటు ఉంది. అన్ని ఆలయాల్లో ప్రత్యేక దర్శనంతోపాటు అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలు, శ్రీకాళహస్తిలో బస కలిపి ఈ ప్యాకేజ్ రూపొందించారు. అంతేకాకుండా రెండు లీటర్ల వాటర్ బాటిల్ కాంప్లిమెంటరీగా అందజేస్తారు. ఈ ప్యాకేజీ ధర పెద్దలు ఒక్కొక్కరికీ రూ.3,775గా నిర్ణయించగా.. పిల్లలకు రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. రోజు విడిచి రోజు ఉండే ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలకు, టికెట్ల బుకింగ్ కు ఏపీ టూరిజం వెబ్ సైట్ తో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పర్యాటక శాఖ రిజర్వేషన్ కేంద్రాలు లేదా 180042545454 టోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించాలి.

ఇదీ షెడ్యూల్…

మొదటి రోజు:

రాత్రి 10 గంటలు: విజయవాడ నుంచి ప్రయాణం ప్రారంభం

రెండోరోజు:

ఉదయం 5 గంటలు: శ్రీకాళహస్తి చేరిక.. ఏపీటీడీసీ హోటల్ లోకి చెకిన్

ఉదయం 7 నుంచి 7.30 వరకు: అల్పాహారం

ఉదయం 7.30 గంటలకు: తిరుపతి పయనం

ఉదయం 8.30 గంటలకు: తిరుపతి బస్టాండ్ కు చేరిక. తిరుమల బస్సు ఎక్కడం

ఉదయం 9.30 గంటలకు: తిరుమల చేరిక

9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య: తలనీలాల సమర్పణ అనంతరం శ్రీవారి శీఘ్ర దర్శనం

మధ్యాహ్నం 12.30 గంటలకు: తిరుపతి పయనం

మధ్యాహ్నం 1.30 గంటలకు: తిరుపతి చేరిక

1.30 గంటల నుంచి 2.00 గంటల వరకు: మధ్యాహ్న భోజనం

మధ్యాహ్నం 2.00 గంటలకు: శ్రీనివాస మంగాపురం పయనం

మధ్యాహ్నం 2.30 గంటలకు: శ్రీనివాస మంగాపురం చేరిక

2.30 గంటల నుంచి 3.00 గంటల మధ్య: శ్రీనివాస మంగాపురం ఆలయంలో దర్శనం

మధ్యాహ్నం 3.00 గంటలకు: అలివేలు మంగాపురం (తిరుచానూరు) పయనం

సాయంత్రం 4.00 గంటలకు: అలివేలు మంగాపురం (తిరుచానూరు) చేరిక

4.00 గంటల నుంచి 5.00 గంటల మధ్య: తిరుచానూరు ఆలయ దర్శనం

సాయంత్రం 5.00 గంటలకు: శ్రీకాళహస్తికి పయనం

సాయంత్రం 6.00 గంటలకు: శ్రీకాళహస్తి చేరిక

6.00 గంటల నుంచి 7.00 గంటల మధ్య: శ్రీకాళహస్తి దర్శనం

సాయంత్రం 7.30 గంటలకు: శ్రీకాళహస్తిలోని ఏపీటీడీసీ హోటల్ కి చేరిక

7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు: రాత్రి భోజనం

రాత్రి 9.00 గంటలకు: విజయవాడకు పయనం

మూడో రోజు:

ఉదయం 4.30 గంటలకు: విజయవాడ చేరిక

4 COMMENTS

  1. 508647 742600The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a whole lot as this one. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear is really a bunch of whining about something which you possibly can repair should you werent too busy on the lookout for attention. 691

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...