Switch to English

జస్ట్ ఆస్కింగ్: అభ్యర్థులు దొరకరట.. దొంగ ఓటర్లైతే దండిగా దొరుకుతారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,434FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా భలే కామెంట్లు చేస్తుంటారు. ‘ఆశలన్నీ చెల్లాచెదురైన తర్వాత తండ్రీ కొడుకుల భాష మారడంలో వింతేమీ లేదు. పార్టీ లేదు బొక్కా లేదు అని స్వయంగా పార్టీ అధ్యక్షుడే అన్నాక వీళ్ళ సంస్కార హీన వీరంగాలు ఇలాగే వుంటాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో లాగే అభ్యర్థులు కూడా దొరకరు. రాసి పెట్టుకోబాబూ..’ అంటూ విజయసాయిరెడ్డి తాజాగా ట్వీటేశారు.

ఇందులో ‘అభ్యర్థులు కూడా దొరకరు..’ అంటూ టీడీపీ మీద విజయసాయిరెడ్డి వేసిన సెటైర్ బాగా పేలింది.. కానీ, అది అధికార వైసీపీకి షాకిచ్చింది. ఎక్కడో ఏదో జరిగితే, దాని ఫలితం ఇంకెక్కడో ఇంకెలాగో వుంటుందన్నట్టు, ‘అభ్యర్థులు కూడా దొరకరా.? దొంగ ఓటర్లైతే దొరుకుతారా.?’ అంటూ నెటిజనులు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా దొంగ ఓటర్లను పురమాయించిందీ సభ్యసమాజమంతా చూసింది కదా. అయినా, ఓటు హక్కుని దోచెయ్యడం, దొంగలకు ఆ ఓట్లను కట్టబెట్టడమేంటి.? పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీకే కాదు, విపక్షాలకు అభ్యర్థులు కరవయ్యారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఇలాంటి దుస్థితి విపక్షాలకు వచ్చినప్పుడు అధికారపక్షం ఎంత ధైర్యంగా వుండాలి.? కానీ, అదికార వైసీపీకి ధైర్యం లేదు. అందుకే, గెలుస్తామో.. ఓడతామోనన్న సందిగ్ధం నడుమ దొంగ ఓటర్లను దించిందన్నది విపక్షాల వాదన.

ఉత్త వాదన కాదు, సాక్షాలు పోలింగ్ రోజునే కనిపించాయి. భర్త పేరు తెలియని భార్య. దొంగ ఓటు వెయ్యడానికి తండ్రి పేరు మార్చేసుకున్న తనయుడు.. ఇవన్నీ కళ్ళ ముందే కనిపించాయి కదా.? వ్యవస్థల్ని ఇంతలా దిగజార్చేస్తే, విపక్షాలకు అభ్యర్థులు వున్నా ఏం లాభం.? తదుపరి ఎన్నికలకు అసలు ఓటర్లంటూ లేకుండా, దొంగ ఓటర్లతోనే మేనేజ్ చేసేస్తారో.. అసలు ఎన్నికల ప్రక్రియే లేకుండా ఏకగ్రీవాలే చేసేసుకుంటారో. ఇలాంటోళ్ళు సోషల్ మీడియాలో నీతులు చెబుతోంటే, ప్రత్యర్థులపై విమర్శలు చేస్తోంటే.. నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు జనానికి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...