Switch to English

రఘురామకృష్ణరాజు ఉవాచ: లేపి తన్నించుకున్నదెవరబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

వైసీపీ ఎంపీ ఒకరు, విశాఖ స్టీలు ప్లాంటు విషయమై పార్లమెంటు సాక్షిగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్రం నుంచి లిఖిత పూర్వక సమాధానం వచ్చింది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయమై రెండో ఆలోచన లేదని కేంద్రం ఈ సమాధానంలో తేల్చి చెప్పేసింది. ‘రేపో మాపో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళతారు కదా.. ఆయనే, కేంద్రాన్ని ఈ విషయమై ప్రశ్నిస్తారు కదా.? ఈలోగా ఎందుకు తొందర.? లేపి తన్నించుకోవడమెందుకు.? కేంద్రం నుంచి సమాధానం రావడం రాష్ట్రానికి చెంప పెట్టు..’ అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు.

‘హైకోర్టు చీవాట్లు పెట్టింది సలహాదారుల విషయమై. అయినా, సిగ్గు లేకుండా సలహాదారు రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు..’ అంటూ మరో తీవ్ర విమర్శ చేశారు నర్సాపురం ఎంపీ. అంతేనా, విజయసాయిరెడ్డి మీదా విరుచుకుపడ్డారు. ‘నా మీద వున్న కేసుల సంగతి మీకు ముందే తెలుసు. తెలిసీ, టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడేమో, ఆ కేసుల్ని సాకుగా చూపించి, నన్ను విదేశాలకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటారా.? మరి, మీ మీద వున్న కేసుల మాటేమిటి.? మీరేమో విదేశాలకు వెళ్ళేందుకు పర్మిషన్ అడుగుతారా.? సిగ్గుండాలి..’ అంటూ విజయసాయిరెడ్డిపైనా రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.

‘నా మీద ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి సెటైర్లు వేస్తున్నారు.. ఆయన మీదా సెటైర్లు పడబోతున్నాయ్.. మొదలు పెట్టబోతున్నా..’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు రఘురామ, విజయసాయిరెడ్డికి. ‘విశాఖ స్టీలు ప్లాంటు విషయంలోనూ, పోలవరం విషయంలోనూ, ఇతరత్రా విషయాల్లోనూ కేంద్రాన్ని నిలదీయడానికీ, కేంద్రంపై ఒత్తడి తీసుకురావడానికీ, రాజీనామాతో నేను రెడీ.. వైసీపీ ఎంపీలందరితోనూ రాజీనామా చేయించెయ్యండి.. ఎలాగూ ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మనమే గెలిచాం కాబట్టి.. ఎంపీలంతా రాజీనామా చేసినా, మళ్ళీ గెలిచేస్తాం..’ అంటూ రఘురామ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం.

రచ్చబండ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయినా, ఆ రాజకీయ వినోదం మళ్ళీ మొదలైంది. రఘురామ మళ్ళీ రోజువారీ ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ఈసారి, రఘురామపై రాజద్రోహానికి మించిన కేసులేమైనా అధికార వైసీపీ ప్లాన్ చేస్తుందా.? వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...