Switch to English

మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. నమ్మకాలకు రెడ్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల్ని అమాంతం పెంచేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 25 శాతం వరకు ‘ధర’ పెరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, దీన్ని ‘మద్య నియంత్రణ’లో కీలకమైన అడుగు.. అని అభివర్ణిస్తుండడమే అభ్యంతరకరం.

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన మాట వాస్తవం. దాదాపు నెలన్నర రోజు లాక్‌డౌన్‌ అనంతరం, కాస్త ఉపశమనం రేపటినుంచి లభిస్తోంది.. మరీ ముఖ్యంగా మందుబాబులకి ఇది పెద్ద ఉపశమనమే. నెలరోజులుగా మద్యం దొరక్క నానా తంటాలు పడుతున్న మందుబాబులకి.. రేపటితో స్వాతంత్య్రం వచ్చినట్లే.

సరే, మద్యం వల్ల కలిగే అనర్ధాలు, ఆరోగ్య సమస్యల సంగతి తర్వాత. ఆ మద్యం ద్వారా ప్రభుత్వ ఖజానాకి లభించే ‘కిక్కు’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పైగా, ఇప్పుడు మద్యం ధర పెరుగుదలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పోటెత్తనుంది. అయినా, దశలవారీ మద్య నియంత్రణ.. చివరికి సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి.. కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన ‘లాక్‌డౌన్‌’ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక, ఇప్పుడీ కొత్త పితలాటకమేంటి.? ఈ ప్రశ్న మేధావి వర్గం నుంచి దూసుకొస్తోంది.

మద్యం రేటు పెరిగితే, మద్యానికి దూరమవుతారన్న అధికార పార్టీ వాదనలో లాజిక్‌ ఏమన్నా వుందా.? మద్యానికి బానిసైనవాళ్ళు.. పెళ్ళాం మెడలో పుస్తెలతాడుని కూడా అమ్మేసిన సందర్భాలనేకం. క్వార్టర్‌ బాటిల్‌ కోసం హత్యలు చేసిన దాఖలాలున్నాయి. మద్యం సమాజానికి చేసే హాని తాలూకు తీవ్రత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యం తప్ప ఇంకో మార్గం లేదు..’ అని ఖజానా క్షేమం కోసం ప్రభుత్వం చెబితే, ఎంతో కొంతమంది ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తారేమో. అంతేగానీ, ధర పెరిగితే మద్య నియంత్రణ జరుగుతుందంటే ఎవరూ సమర్థించే పరిస్థితి వుండదు. పైగా, కల్తీ మద్యం సహా అనేక అనర్ధాలకు కారణమవుతుంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే చాలా ఎక్కువ. ఆ కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం ‘స్మగుల్‌’ అవుతోంది. రాష్ట్ర సరిహద్దులకి ఆవలకు వెళ్ళి మరీ మద్యం బాఋలు తమ ‘దాహం’ తీర్చుకుంటున్నారాయె. ఇకపై ఈ పైత్యం మరింత పెరిగిపోనుంది. అంతే తప్ప, మద్య నియంత్రణలో ధర పెంపు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కీకమైన ముందడుగు కాబోదు. పైగా, పొరుగు రాష్ట్రాలకు అదనపు మేలు చేసినట్లవుతుంది.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై మాట్లాడడానికి భయపడే హీరోయిన్ల ఆలోచనలో క్రమంగా...

ఎన్.టి.ఆర్ కాకపోతే వెంకీ – నానిలకి ఫిక్స్ అంటున్న త్రివిక్రమ్.?

కరోనా అనేది లేకుండా ఉంటే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉండి ఉంటారు....

ఫ్లాష్ న్యూస్: దున్నపోతును హింసించారు.. ఎలా పగ తీర్చుకుందో తెలుసా..

కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం చేసిన పనులే మనల్ని వెంటాడుతూ మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన ఆ తుంటరి పనే వారికి కర్మ రూపంలో జరిగింది. తనను...

నా ట్వీట్‌ అర్థం చేసుకోమంటూ మెగా బ్రదర్‌ విజ్ఞప్తి

సామాన్యులు సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ చేసినా, ఎలాంటి కామెంట్స్‌ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. కాని సెలబ్రెటీలు మాత్రం ఏ చిన్న పదం ట్వీట్‌ చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున...