Switch to English

భక్తుల మనోభావాలు ‘గోవిందా’

కొంతమంది వైసీపీ నేతల తీరు ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. ఓవైపు విపక్షాల విమర్శలూ..మరోవైపు కరోనా వల్ల ఎదురవుతోన్న కష్టాలనూ అధిగమిస్తూ అడుగులు ముందుకేస్తోన్న వైసీపీ ప్రభుత్వానికి సొంతపార్టీ నేతల వ్యవహారశైలి అదనపు తలనొప్పిగా మారుతోంది. ఇందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా వంటి నేతల లిస్టులో తాజాగా టిడిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా చేరింది.

సరే…తాజా వివాదం ఏంటంటారా…? అయితే మేటర్ లోకి వెళ్దాం..సుబ్బారెడ్డిపై వచ్చిన తాజా ఆరోపణ ఏంటంటే మే ఒకటవ తేదీన తన జన్మదినం సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్నారని. సరే, టిడిడి ఛైర్మన్ కాబట్టి ఆయనకు మిగిలిన వారి కంటే కాసింత స్వాతంత్ర్యం ఎక్కువే ఉంటుందనుకుంటే పొరపాటేనన్న సమాధానం రీసౌండ్ లో వినిపిస్తోంది.

ఓవైపు తమ ఆరాధ్యదైవాన్ని కరోనా కారణంగా దర్శించుకోలేక వేధనకు గురవుతోన్న భక్తులకు మాత్రం ఛైర్మన్ తాజా తీరు చికాకనిపిస్తోంది. కరోనా సమయంలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా స్వామివారి ఆలయం భక్తులకు దూరమైన నేపధ్యంలో… నాకు అధికారం ఉంది కాబట్టి నేను, నా కుటుంబంతో ఎప్పుడైనా వెళ్తాను అన్నట్లు ఛైర్మన్ వ్యవహారం కనబడుతున్నట్లుందని ప్రధాన ప్రతిపక్షం విమర్శనాస్త్రాలు గుప్పించింది. పేద, ధనిక తేడా లేని వెంకన్న స్వామి దగ్గర ఇలాంటి పనులా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం గుర్రుమంటున్నారు.

అయితే భార్య, తల్లితో మాత్రమే తాను దేవాలయానికి వెళ్లాననీ ఆరోజు తన జన్మదినం కావటం యాధృచ్ఛికమేనని సుబ్బారెడ్డి కొట్టిపారేస్తున్నారు. బయటకు వచ్చిన ఫోటోల్లో తన పక్కన ఉన్న వారంతా టిటిడి సిబ్బందేనని తేల్చిచెప్పారు. సరే..మీ అధికారం మీ ఇష్టమని ఈ వ్యవహారాన్ని పక్కనబెడితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ మతపరమైన ఆరోపణల్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తోంది.

ప్రభుత్వంవైపు నుండి జరుగుతున్న పొరపాట్లో లేక ఇంకేదైనా కారణాలున్నాయో తెలియవు కానీ ఈ ఆరోపణలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. తిరుమల ఘాట్ రోడ్ కు రంగు మార్పు కూడా వివాదమైంది. అప్పుడు విమర్శలు రావటంతో వెంటనే సరిదిద్దుకుని పాత రంగుల్నే వేయించింది. ఇందుకు ఖర్చు అదనం కదా అంటారా…? దాని గురించి మళ్లీ మాట్లాడుకుందాం.

ఆ తర్వాత నాలుగురోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి తిరుమల గురించి మాట్లాడిన వ్యాఖ్యల్ని సైతం స్వామి వారి భక్తులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయన వ్యాఖ్యల సారాంశం ఏంటంటే…వందల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఖర్చుల్ని ఎలా తగ్గించుకోవాలి…? జీతాల విషయంలో ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నాం అన్నట్లు సుబ్బారెడ్డి మాట్లాడిన తీరు ఆలయాన్ని ఆదాయవనరుగా చూస్తున్నారే తప్ప స్వామివారి సేవలు, భక్తులకు కలుగుతున్న ఇబ్బందుల కోణంలో మాట్లాడలేకపోయారన్న బాధ చాలామందిలో కనిపించింది.

సరే..ఇవన్నీ మరచిపోదామనుకుంటే టిటిడిలోవరుసగా జరుగుతోన్న పరిణామాలు అక్కడ పనిచేసే ఉద్యోగులను అభద్రతా భావానికి గురిచేస్తున్నాయి. తాజాగా 1400 మంది చిరుద్యోగులను ఉన్నపళంగా తీసేయాలని నిర్ణయం తీసుకోవటం దానిపై విమర్శలు వచ్చిన దరిమిలా మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం కూడా చకచకా జరిగిపోయింది. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలన్నీ స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు…మరి ఇలాంటి వాటన్నిటినీ విపక్షాల విమర్శల కిందే లెక్కకట్టి ప్రభుత్వం వాటిని మూటకట్టి పక్కనపడేస్తుందా..? లేక జరిగిన తప్పులు, పొరపాట్లను సరిదిద్దుకుని తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా అన్నది చూడాలి. అంతవరకూ ఓం నమో వెంకటేశాయ..

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: దున్నపోతును హింసించారు.. ఎలా పగ తీర్చుకుందో తెలుసా..

కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం చేసిన పనులే మనల్ని వెంటాడుతూ మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన ఆ తుంటరి పనే వారికి కర్మ రూపంలో జరిగింది. తనను...

ఫ్లాష్ న్యూస్: తిరుపతి లడ్డూ 25 రూపాయలకేనట

తిరుమల లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెల్సిందే. కానీ, ఆ తిరుపతి లడ్డూ చుట్టూ చాలా వివాదాలు గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం. లడ్డూ ధరల పెంపుపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నా.. టీటీడీ,...

కుమారుడి మృతితో సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం.!

తమిళ, కన్నడ, మళయాళ భాషలలో అలనాటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన సీనియర్ నటి, కళాభినేత్రి వాణీశ్రీ ఇంట నేడు విషాదం చోటు చేసుకుంది. వాణీశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తీక్...

క్రైమ్ న్యూస్: గొర్రెకుంట మృత్యుబావి మిస్టరీలో మరో ట్విస్ట్.!

ఈ రోజు ఉదయమే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల మర్డర్ కి కారణమైన సంజయ్ కుమార్ యాదవ్ నిజానిజాలు ఒప్పుకోవడంతో ఈ మృత్యుబావి మిస్టరీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్...