ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శిరీష బండ్ల.. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిందని ఘనంగా చెప్పుకుంటున్నాం. మరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో వుంది.? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం పరిస్థితేంటి.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టబుడుల్ని ఆకర్షించడంలో ఏ స్థానంలో వుంది.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ ఎలా వుంది.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎలా వున్నాయి.? ఇలా ప్రశ్నించుకుండూ పోతే, దేనికీ సరైన సమాధానం దొరకదు.
రాజధాని అమరావతి.. అని చెప్పుకోవడానికీ వీల్లేదు. దాన్ని స్మశానంగా, ఎడారిగా అధికార పార్టీకి చెందిన నేతలు.. అందునా, మంత్రులే అభివర్ణిస్తున్నారాయె. అలాంటప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టబుడులు ఎలా వస్తాయి.? పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎలా చూస్తారు.?
అయిపోయింది.. అంతా అయిపోయింది.. తెలంగాణలో భూములు రికార్డుల స్థాయిలో అమ్ముడు పోతోంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారవుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళాల్సి వస్తోంది.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం. తెలంగాణలో వున్న ఆంధ్రోళ్ళు తెలంగాణోళ్ళే.. సీమాంధ్రులని చెప్పుకోవడం ఇష్టం లేకపోతే.. హైద్రాబాదీలమని చెప్పుకోండి.. తెలంగాణలో వున్నోళ్ళంతా తెలంగాణ ప్రజలే.. ఇక్కడి అభివృద్ధిలో భాగం కండి.. అంటూ తెలంగాణ ప్రభుత్వం పిలుపునిస్తోంది.
ఒకరిద్దరు తెలంగాణ నేతలు అవాకులు చెవాకులు పేలినా, తెలంగాణలో సీమాంధ్రులకు వచ్చిన సమస్య ఏమీ లేదు.. గడచిన ఏడేళ్ళుగా ఎలాంటి ఇబ్బందులూ లేవు వారికి. ఆంధ్రప్రదేశ్ సమీప భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందన్న భ్రమలేవీ లేవిప్పుడు. ఎందుకంటే, అక్కడి రాజకీయం.. కక్ష సాధింపులకే పరిమితమైపోయింది. కుల గజ్జి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయిందక్కడ.
రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అవసరమన్న కనీస విజ్ఞత అధికార పార్టీకి లేకుండా పోయింది. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ఆ అభివృద్ధి ఫలాల నుంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచన లేని పాలన.. రాష్ట్రానికి శాపమే మరి. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.. ఏమున్నది పరిపాలనలో గర్వకారణం.? నానాటికీ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దారుణంగా దిగజారిపోతోంది.. ఈ పాపం ఎవరిది.?
53897 635297of course data entry services are really expensive that is why always make a backup of your files 715715
619532 880191View the following ideas less than and find to know how to observe this situation whilst you project your home business today. Earn cash from home 574875
944863 303219hello, i came in to learn about this subject, thanks alot. will put this internet site into my bookmarks. 234333
288193 810580I like the way you conduct your posts. Have a good Thursday! 381896