నారాయణ విద్యా సంస్థల అధినేత, టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేశారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా, కేవలం చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణంగా నారాయణకు అప్పట్లో కీలకమైన మంత్రి పదవి దక్కింది. రాజధాని అమరావతి విషయంలో నారాయణ అన్నీ తానే అయి వ్యవహరించారు. తనదైన వ్యూహాల్ని నారాయణ అమలు చేసి, రాజధానిని తనకు తోచిన రీతిలో ‘గందరగోళం’గా మార్చేశారు.
ఈ రోజు, అమరావతిలో ఇంతమంది రైతులు కన్నీరు పెడుతున్నారంటే.. ఈ ‘పాపం’లో మెజార్టీ వాటా నారాయణకే దక్కాలి. కానీ, చిత్రంగా నారాయణ పేరు ఎక్కడా విన్పించడంలేదు. గతంలో నారాయణ మీద నానా రకాల ఆరోపణలు చేసిన వైసీపీ, ఇప్పుడెందుకో ఆయన విషయంలో కొంత వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అసలేం జరుగుతోంది.? నారాయణ మీద అప్పుడు టీడీపీకి ‘అతి’ ప్రేమ, ఇప్పుడు అదే నారాయణ మీద వైసీపీకి ‘కొంత ప్రేమ’ వెనుక అసలు కారణమేంటి.?
గత కొద్ది కాలంగా రాజధాని అమరావతి చుట్టూ నానా యాగీ జరుగుతున్నా నారాయణ పెద్దగా మీడియా ముందుకొచ్చి స్పందించిన దాఖలాల్లేవు. ఇప్పుడూ అంతే. ‘నాకేంటి సంబంధం.?’ అంటూ ఆయన రాజకీయాలకు దూరంగా వున్నారా.? లేదంటే వ్యూహాత్మకంగా ఇటు టీడీపీ, అటు వైఎస్సార్సీపీ తెరవెనుక లాలూచీల్లో భాగంగా ఆయన్ని దూరంగా వుంచుతున్నాయా.? ఏమోగానీ, నారాయణ ఆచూకీ రాజకీయ తెరపై కన్పించకపోవడంతో అమరావతి రైతుల్లోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘మా భూముల్ని ప్రభుత్వానికి మేం ఇచ్చే క్రమంలో నారాయణ కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన తేనె పలుకులు పలికారు. ఇప్పుడాయన మాటే కరువయ్యింది.. నాయకులంటే పదవుల కోసమే.. రాజకీయాలంటే సంపాదన కోసమే అనడానికి నారాయణ ఓ నిదర్శనం మాత్రమే..’ అంటూ అమరావతి రైతులు వాపోతున్న పరిస్థితి కన్పిస్తోంది. ఏదిఏమైనా, అమరావతి రైతులు కంటతడిపెడ్తున్న వేళ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇప్పుడైనా నారాయణను రైతుల వద్దకు పంపి, వారికి భరోసా ఇప్పించాలి. అదే సమయంలో, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం సైతం, అమరావతి కుంభకోణం అంటోంది గనుక.. నారాయణనే ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా చూపాల్సి వుంటుంది.
783126 744882I want to thank you for the excellent post!! I surely liked every bit of it. Ive bookmarked your web internet site so I can take a appear at the latest articles you post later on. 116699
835594 478071Gnarly article mate, maintain the great work, just shared this with ma friendz 327755
915012 859434Absolutely indited content material , Truly enjoyed looking at . 53399