Switch to English

9 నెలలు.. 39 పరిశ్రమలు.. 20వేల కోట్ల పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి చోటే లేదని, సర్కారు అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి కూడా వెళ్లిపోతున్నాయంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా దాదాపు రోజూ చేసే ఆరోపణలే. జగన్ నవ మాసాల పాలన నవ మోసాలుగా సాగిందంటూ టీడీపీ విమర్శలు కూడా చేసింది. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని తీవ్రంగా ధ్వజమెత్తింది.

అయితే, వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. జగన్ పాలన చేపట్టిన ఈ తొమ్మిది నెలల్లో దాదాపు 20వేల కోట్ల పెట్టుబడులతో 39 పరిశ్రమలు తమ ఉత్పత్తులు ప్రారంభించాయని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. వీటి ద్వారా దాదాపు 33 వేల మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొంది.

అలాగే 1840 కోట్లతో ఏర్పాటైన సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా మరో 49 వేల మందికి ఉపాధి కలుగుతోందని వివరించింది. ఇవి కాకుండా మరో 50వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించింది.

నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఆగిపోయిందనే విమర్శలు వెల్లువలా వచ్చాయి. ఒక్క పరిశ్రమా రాలేదని టీడీపీ నేతలు పనిగట్టుకుని పదేపదే విమర్శలు చేసేవారు. అయితే, వీటిని తిప్పి కొట్టడంలో అధికార పార్టీ విఫలమైంది. ఈ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఒక్కరూ ధీటుగా చెప్పలేకపోయారు. మీడియా అండ మొత్తం టీడీపీకే ఉండటం వైసీపీకి మైనస్ అయింది.

అదే చంద్రబాబు హయాంలో ఏ చిన్న ఒప్పందం జరిగినా మీడియాలో బాగా హైలైట్ అయ్యేది. దీంతో బాబు హయాంలో బోలెడె అభివృద్ధి జరుగుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేవి. కానీ ఆయా ఒప్పందాల్లో చాలా కంపెనీలు రాష్ట్రంలో ఇప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో జగన్ హయాంలో 22వేల కోట్ల పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటయ్యాయనే విషయాన్ని తాజాగా ప్రభుత్వం వెల్లడించింది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

శ్రీదేవి ఇంట కరోనా పాజిటివ్ నమోదు

హాలీవుడ్ వారితో పోల్చితే ఇండియన్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం తక్కువే. ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడి ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు కూడా...

క్రైమ్ న్యూస్: కూలీ భార్యపై కాంట్రాక్టర్ రేప్ అటెంప్ట్.. ఆమె ఏం చేసిందంటే..

లాక్ డౌన్ పరిస్థితుల్లో అసంఘటిత కార్మికులు పడుతున్న అవస్థలకు ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు. వీలైనంతలో వారికి సాయం చేస్తున్న కొందరు తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా ఓ కాంట్రాక్టర్ కూలీ...

బాలీవుడ్ సూపర్ స్టార్ తో పూరి జగన్నాథ్?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. జెట్ స్పీడ్ లో...

వలస కార్మికుల కోసం అల్లు అరవింద్ సైతం

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల్లోనే ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులకు వ్యవస్థలే నిస్తేజమైపోవడంతో ఎక్కువగా బలైపోయింది అసంఘటిత కార్మికులే. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉపాధి కరువై పోయింది. దీంతో ఉన్నదేదో చేతబట్టి...

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...