Switch to English

సైరా’పై ‘పెయిడ్‌’ ఏడుపు.. సోషల్‌ ఫ్రస్ట్రేషన్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

సినిమా ఫ్లాపవుతుందని తెలిసి ఎవరైనా కోట్లు గుమ్మరిస్తారా.? చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకంతోనే సినిమా తీస్తారు. రిజల్ట్‌ ఎలా వున్నా, తమ సినిమా చాలా బావుందని పబ్లిసిటీ చేసుకుంటారు.. చేసుకోవాలి కూడా. కొన్ని సినిమాలకు అంచనాలు తారుమారవుతుంటాయి. కొన్ని అనూహ్యంగా విజయాలు అందుకుంటుంటాయి.

తెలుగు సినీ పరిశ్రమలో హీరోల మధ్య పెద్దగా విభేదాల్లేవు. కానీ, హీరోల అభిమానుల్లో కొందరు మాత్రం కులగజ్జితోనో, ఇతరత్రా మానసిక సమస్యలతోనో తమకు నచ్చని హీరోల్ని ట్రోలింగ్‌ చేసేస్తుంటారు. ఆ హీరో, ఈ హీరో అన్న తేడాల్లేవు.. దాదాపు అందరు హీరోలూ ఈ ‘హేటర్స్‌’ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఫస్ట్‌ లుక్‌ వచ్చిన దగ్గర్నుంచి, ఓ ‘పెయిడ్‌ బ్యాచ్‌’, నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేస్తూ వస్తోంది.

‘హను’ పేరుతో ఓ సోషల్‌ మీడియా అకౌంట్‌ అయితే, మరీ జుగుప్సాకరంగా ‘సైరా నరసింహారెడ్డి’కి వ్యతిరేకంగా పనిచేస్తుండడం గమనార్హం. ఎన్టీఆర్‌ మీద అభిమానం ముసుగులో చేస్తున్న దురాగతం ఇది. ‘సైరా నరసింహారెడ్డి’ వసూళ్ళ విషయమై ఎలాంటి ప్రకటనా చేయకూడదని నిర్మాత రామ్‌చరణ్‌ నిర్ణయం తీసుకున్నాడు. బాక్సాఫీస్‌ ట్రాకర్స్‌ కొన్ని లెక్కల్ని ప్రచారంలోకి తెస్తున్న విషయం విదితమే. వాటిని ఇంతవరకూ ‘సైరా’ టీమ్‌ సమర్థించలేదు, తప్పుపట్టలేదు. చాలా సినిమాల విషయంలో ఈ బాక్సాఫీస్‌ ట్రాకర్స్‌ లెక్కలే నిజమవుతుంటాయి.

కానీ, ‘సైరా’ విషయంలో అదనంగా కలిపేశారంటూ రచ్చ షురూ చూస్తున్నారు హేటర్స్‌. ‘సైరా’ ఎంత వసూలు చేస్తుందన్నదానిపై పెద్దగా ఆలోచనల్లేవని సినిమా రిలీజ్‌కి ముందే ‘సైరా’ టీమ్‌ చెప్పేశాక, ఈ ‘కాకి గోల’ ఎందుకో అర్థం కాదు. చరణ్‌ – ఎన్టీఆర్‌ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. మహేష్‌ – ఎన్టీఆర్‌ – చరణ్‌ మంచి ఫ్రెండ్స్‌. బాలయ్య – చిరంజీవి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఏ హీరో కూడా ఈ హేటర్స్‌ని ఎంకరేజ్‌ చేసే పరిస్థితి వుండదు.

కేవలం కుల గజ్జితోనో, ఇతరత్రా వ్యక్తిగత విధ్వేషాలతోనో సినీ రంగంలో అంచలంచెలుగా ఎదిగినవాళ్ళని కించపర్చాలనుకుంటే.. అది ఆకాశం మీద ఉమ్మేసినట్లే అవుతుందన్నది నిర్వివాదాంశం. చిరంజీవి కావొచ్చు, విజయ్‌ దేవరకొండ కావొచ్చు.. మహేష్‌బాబు కావొచ్చు, నాని కావొచ్చు.. ఎవరైనాసరే, ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడమే లక్ష్యంగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. నచ్చితే సినిమా చూడొచ్చు, నచ్చకపోతే నచ్చలేదనొచ్చు.. అంతేగానీ, సిల్లీగా సోషల్‌ మీడియాలో వెర్రి తలలు వేస్తే మాత్రం దాన్ని సోషల్‌ వ్యభిచారం అనడం తప్పేమీ కాదు.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...