Switch to English

మంత్రిగారికి రైతు భరోసా: అదిరిందయ్యా జగనూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

రైతు భరోసా.. అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకమిది. ఈ పథకం కింద లబ్దిదారు జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేరు నమోదవడం రాజకీయంగా పెను దుమారమే రేపింది. అయితే, మంత్రిగారు హుటాహుటిన డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు దిగారు. తన పేరు ఆ లిస్ట్‌లోకి ఎలా వచ్చిందంటూ ఉన్నతాధికారుల్ని నిలదీశారు. తాను రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోలేదని, సాంకేతిక తప్పిదం కారణంగా ఇది జరిగి వుండొచ్చనీ మంత్రి వివరణ ఇచ్చుకున్నారు.

కానీ, గ్రామ వాలంటీర్‌ పోస్టులు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నట్లు ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించిన దరిమిలా, రైతు భరోసా పథకం కూడా వైసీపీ జెండాలకే కట్టబెడుతున్నారా.? అన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. మరోపక్క, జరిగిన పొరపాటుపై అధికార పార్టీ మల్లగుల్లాలు పడ్తోంది. అసలే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో పార్టీ పరువు బజార్న పడిపోయిన దరిమిలా, ఇప్పుడు ఇంకో పొరపాటు జరగడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా అధికారులపైనా, పార్టీ ముఖ్య నేతలు, మంత్రులపైనా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కాగా, క్యాబినెట్‌లో పలువురు మంత్రుల పని తీరు ఏమాత్రం బాగాలేదని ఇప్పటికే పలుమార్లు అంతర్గతంగా ఆయా మంత్రుల్ని మందలించిన వైఎస్‌ జగన్‌, త్వరలోనే పలువురు మంత్రులకు షాక్‌ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ‘చిన్న చిన్న పొరపాట్లు.. సాంకేతిక సమస్యలు..’ అంటూ కుంటి సాకులు చూపడం తగదని, ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెస్తున్న పథకాల్లో ఏ మాత్రం లోటుపాట్లు జరిగినా.. పార్టీ పరువు పోతుందని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు. కానీ, కింది స్థాయి నేతలు.. కొందరు అధికారుల అత్యుత్సాహం.. వెరసి, సంక్షేమ పథకాలు అధికార పార్టీకి మాత్రమే దక్కుతున్నాయన్న విమర్శలు చాలా చాలా గట్టిగా విన్పిస్తున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...