Switch to English

నరేష్, క్షమించరాని నేరం చేసేశాడు.? కానీ, ఎందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

నిజమే, ఇది చాలా పెద్ద నేరం. ‘సీనియర్ నటుడు, ఇంత నిర్లక్ష్యపూరితంగా, ఇంత బాధ్యతారాహిత్యంతో ఎలా మాట్లాడాడు.?’ అని జనం అనుకున్నారు. ఈ విషయమై సాయంత్రానికి సినీ ప్రముఖులూ స్పందించారు.

అసలు నరేష్ ఏమన్నాడు.? సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవడంపై నరేష్ స్పందించాడు. ఓ సినీ నటుడిగా, ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ స్పందనలో కొంత మంచి విషయం వుంది, కొంత కక్కుర్తి వుంది. కక్కుర్తి మాత్రమే కాదు, అసహనం కూడా వుంది. కక్కుర్తి ఏంటంటే, తానూ ఒకప్పుడు బైక్ రైడర్‌నేనని చెప్పుకోవడం.

అసహనం ఎలా బయటపడిందంటే, సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయానికి.. గతంలో బాబూమోహన్ తనయుడు, కోట శ్రీనివాసరావు తనయుడు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనల్నీ పోల్చి చెప్పడం.

సాయి ధరమ్ తేజ్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. పూర్తిస్థాయిలో ఇంకా కోలుకోలేదు. ఇలాంటి సమయంలో, రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన వారి ప్రస్తావన ఎందుకు.? సాధారణంగా నరేష్ ఏ మాట మాట్లాడినా చాలా బ్యాలెన్స్‌డ్‌‌గా మాట్లాడతాడు. కానీ, ఇక్కడాయన బ్యాలెన్స్ తప్పేశాడు.

నరేష్ తనయుడు నవీన్, సాయి ధరమ్ తేజ్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసే ఇంటి నుంచి బయటకు వేర్వేరు బైక్‌ల మీద వెళ్ళినట్లు నరేష్ చెబుతున్నాడు. నరేష్ తనయుడు నవీన్ రోడ్డు ప్రమాదానికి గురైతే.. ఆసుపత్రిలో నవీన్ వైద్య చికిత్స పొందుతూ వుంటే, నరేష్.. గతంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారి ప్రస్తావన తీసుకురాగలగుతాడా.? ‘సాయి ధరమ్ తేజ్ కూడా నా కొడుకు లాంటోడే.. మా కుటుంబాల మధ్య ఎప్పటినుంచో స్నేహం వుంది..’ అని చెబుతున్న నరేష్, కొడుకు లాంటి వ్యక్తి.. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చేరి వైద్య చికిత్స పొందుతోంటే, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి గురించి మాట్లాడటమేంటి.? అని బండ్ల గణేష్, శ్రీకాంత్ తదితరులు తీవ్రంగా స్పందించారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో పెరిగిన ‘సినీ విభేదాల’ వల్ల నరేష్ ఇలా సంయమనం కోల్పోయాడా.? అన్న చర్చ సినీ పరిశ్రమలో కనిపిస్తోంది. మెగా కుటుంబం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తోందట.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....