Switch to English

బర్త్‌డే స్పెషల్‌: షష్టిపూర్తి అయినా బాలయ్య తిరుగులేని నట సింహమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం నందమూరి తారక రామారావు ఎలా అయితే నిలిచి పోతారో అలాగే ఆయన వారసుడిగా తెలుగు సినిమాను సుమారు మూడు దశాబ్దాలుగా ఏలేస్తున్న బాలకృష్ణ కూడా నిలిచి పోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సుదీర్ఘ కాలంగా టాప్‌ స్టార్‌ హీరోగా నిలిచి ఇప్పటికి కూడా స్టార్‌ హీరోగానే వెలుగు వెలుగుతున్న బాలకృష్ణ సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు, పొందిన ప్రశంసలు అతి కొద్ది మందికే సాధ్యం అయ్యాయి. కొన్ని పాత్రలు కేవలం ఆయన కోసమే పుట్టాయా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాక్షన్‌ పాత్రలు అయిన నరసింహనాయుడు మరియు సమరసింహారెడ్డి పాత్రల్లో ఆయన కనిపించిన తీరు మరే హీరోకు అది సాధ్యం కాదేమో అన్నట్లుగా ఉంటుంది. ఫ్యాక్షన్‌ హీరోగా చేతిలో గొడ్డలి పట్టుకుని విలన్స్‌ను నరుకుతూ ఉంటే ఆయన బాడీలాంగ్వేజ్‌ నిజంగా ఈయన ఫ్యాక్షనిస్ట్‌ అయ్యి ఉంటాడా అన్నట్లుగా అనుమానం వచ్చేది.

ఈ తరం హీరోల్లో పౌరాణిక పాత్రలు వేయగల సత్తా కేవలం బాలకృష్ణకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు ఒప్పుకునే విషయం. తండ్రి ఎన్టీఆర్‌ ఉన్నప్పటి నుండి మొన్నటి గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం వరకు బాలయ్య ఎన్నో అద్బుతమైన పౌరాణిక పాత్రలు చేయడంతో పాటు అలరించాడు. అన్ని విధాలుగా తనకు పౌరాణిక పాత్రలు నప్పుతాయని నిరూపించుకున్నాడు.

బాలకృష్ణ సినీ కెరీర్‌లో దాదాపుగా అన్ని రకాల పాత్రల్లో నటించడంతో పాటు ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా భైరవ ద్వీపం చిత్రంలో కురూపిగా నటించేందుకు బాలయ్య ఒప్పుకోవడం అప్పట్లో రికార్డుగా చెప్పుకుంటారు. ఒక స్టార్‌ హీరో అంతే కాకుండా అందగాడిగా పేరున్న బాలయ్య అలాంటి పాత్రల్లో నటించడం అంటే నిజంగా సాహస నిర్ణయంగా అభివర్ణించారు.

బాలకృష్ణ 9వ తరగతి చదువుతున్న సమయంలోనే అంటే 14 ఏళ్ల వయసులోనే తాతమ్మకల అనే సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాకు ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించారు. తండ్రి ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ఎన్నో సినిమాలు చేసిన బాలకృష్ణ హీరోగా 1984వ సంవత్సరంలో సాహసమే జీవితం అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా నిరాశ పర్చినా ఆ తర్వాత ఎన్నో సూపర్‌ హిట్స్‌ చేశాడు.

బాలకృష్ణ సెన్షేషనల్‌ సూపర్‌ హిట్స్‌ సుల్తాన్‌ చిత్రం నుండి ఆరంభం అయ్యాయి. మంగమ్మగారి మనవడు, టాప్‌ హీరో చిత్రాలతో మాస్‌ ఆడియన్స్‌కు మరింతగా చేరువయ్యాడు. ఇక నరసింహనాయుడు సినిమాతో టాప్‌ స్టార్‌గా నిలిచిపోయాడు. ఆ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు. కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావుల దర్శకత్వంలో అత్యధిక సినిమాలు చేసిన బాలకృష్ణ తండ్రితో కలిసి పలు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల్లో పెద్దగా స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు.

బాలకృష్ణ నటించిన ఆధిత్య 369, భైరవ ద్వీపం చిత్రాలు తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలిచిపోయే సినిమాలు. తండ్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌ ను రెండు పార్ట్‌లుగా తెరకెక్కించిన బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా రెండు విధాలుగా నష్టపోయాడు. గత కొన్నాళ్లుగా బాలయ్య కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఈ షష్టి పూర్తి నుండి మళ్లీ మునుపటి సక్సెస్‌లను దక్కించుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

బాలయ్య నేడు తన 60వ పుట్టిన రోజు అంటే షష్టి పూర్తి జరుపుకుంటున్నారు. షష్టి పూర్తి అయినా కూడా బాలయ్య ఇంకా నటసింహమే అంటూ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. బర్త్ డే సందర్భంగా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ రోర్ నిజంగా ‘సింహా గర్జన’ లానే ఉందని బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబో లో రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. టీజర్ చూసాక ఈ సినిమా కుడా మరో బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని అంతా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా బాలయ్యకు తెలుగుబుల్లెటిన్.కామ్ తరపున,‌ ఇంకా ఆయన అభిమానుల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాలకృష్ణ మరిన్ని మంచి పాత్రల్లో నటించి మెప్పించాలని ఆశిస్తున్నాం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...