కింగ్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ షూటింగ్ మొదలుపెట్టేసాడని నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ ఆగస్టులోనే మొదలవుతుందని ఇప్పటికే చూచాయిగా తెలిసింది. బిగ్ బాస్ సీజన్ 4 త్వరలోనే ఉంటుందని కూడా అధికారికంగా వెల్లడైంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షూట్ పనులు కూడా మొదలైపోయాయి. బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అందుకో ఈ ఏడాది పరిస్థితులు అంతలా అనుకూలించకపోయినా బిగ్ బాస్ ను నిర్వహిస్తున్నారు. ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారట. కాకపోతే యాజమాన్యం ఈ వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచిందని సమాచారం.
ఇక నాగార్జున కొద్ది సేపటి క్రితం ట్విట్టర్ లో స్పందిస్తూ మళ్ళీ లైట్స్, కెమెరా, యాక్షన్ అని వినడం నిజంగా వావ్ లా ఉంది అని అర్ధం వచ్చేలా ట్వీట్ చేసాడు. ట్వీట్ తో పాటు రెండు పిక్స్ ను కూడా జత పరిచాడు నాగ్. ఆ ఫోటోల ప్రకారం చూస్తుంటే ఇది బిగ్ బాస్ ప్రోమో కోసమే అని అర్ధమవుతోంది. నాగార్జున పక్కన ఉన్న అసిస్టెంట్స్ పీపీఈ కిట్స్ ధరించి అత్యంత సురక్షితంగా ఈ షూట్ ను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రోమోతో బిగ్ బాస్ ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. ప్రతీసారిలా కాకుండా ఈ ఏడాది కేవలం 50 రోజులకే బిగ్ బాస్ ను పరిమితం చేశారు.
Back on the floor with Lights, Camera, Action..what a wow…WOW!!! pic.twitter.com/tHg30ZgLl6
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 1, 2020
676446 455568Hello! I could have sworn Ive been to this blog before but soon after browsing by means of some of the post I realized it is new to me. Anyways, Im surely happy I identified it and Ill be book-marking and checking back often! 729999