కన్న తండ్రే కసాయివాడిలా మారబోయాడు. మానసిక వికలాంగుడు అయిన తన ఏడేళ్ల కుమారుడిని చంపేద్దామని కంకణం కట్టుకున్నాడు. దానికి ఆ తల్లి ససేమీరా అంది. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని అడ్డుగా నిలిచింది. అత్తమామల వేధింపులు ఉన్నా కూడా తన బిడ్డకు అన్నీ తానై నిలిచింది.
అయితే చివరికి ఆ పోరాటంలో అలిసిపోయి, అన్నీ తానై ఉన్న బిడ్డను ఒంటరివాడిని చేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. వివరాల్లోకి వెళితే… సామర్లకోటకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీధర్ కు, సర్పవరం ప్రాంతానికి చెందిన స్వాతికి 2013లో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడు మానసిక వికలాంగుడు. వీరు కేపీహెచ్బి లోని మెజెస్టిక్ హోమ్స్ లో నివాసముంటున్నారు.
తండ్రి శ్రీధర్ తన కొడుకుని అనాథ శరణాలయంలో వేస్తానని చెబితే ఆ తల్లి ఒప్పుకోలేదు. ఈ విషయంలో భర్త, అత్తమామల వేధింపులు తాళలేక అపార్ట్మెంట్ 22వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.