Switch to English

ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లిరికల్ సాంగ్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి ‘కాలం సూపుల గాలంరా..’ లిరికల్ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ – “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాలో ‘కాలం సూపుల గాలంరా..’ పాటకు గోరేటి వెంకన్న సాహిత్యాన్ని అందించగా రామ్ మిర్యాల పాడాడు. స్నేహితుడు అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించారు. ఆల్ ది బెస్ట్ అరుణ్ అండ్ టీమ్. చైతన్య హీరోగా కుమారస్వామి దర్శకత్వం వహించిన “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాను షరతులు పెట్టకుండా ఆడియెన్స్ చూసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ – స్టార్ లైట్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. ప్రొడ్యూసర్స్ ఎన్ఆర్ఐలు అయినా సినిమా మీద ప్యాషన్ తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇదొక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా. కరీంనగర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉన్నా కథలోని ఎమోషన్ యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మానవ సంబంధాల్లో వస్తున్న పరిణామాల చుట్టూ “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” కథ సాగుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డ్ గెల్చుకుని భారతీయ సినిమా ఖ్యాతిని మరింతగా పెంచారు కీరవాణి గారు. ఆయన చేతుల మీదుగా ఇవాళ మా సినిమాలోని ‘కాలం సూపుల గాలంరా..’ పాటను రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మా టీమ్ తరుపున కీరవాణి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – కీరవాణి గారు మా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాలోని ‘కాలం సూపుల గాలంరా..’ పాట రిలీజ్ చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఆయనకు మా టీమ్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ పాటకు గోరేటి వెంకన్న గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. రామ్ మిర్యాల అంతే గొప్పగా పాడారు. అరుణ్ ఇచ్చిన ట్యూన్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అవుతుంది. త్వరలోనే థియేటర్స్ ద్వారా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” రిలీజ్ చేయబోతున్నాం. మీరంతా మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ – ఈ ఒత్తిడి ప్రపంచంలో దర్శకుడిగా నాకు రిలీఫ్ ఇచ్చేది సంగీతమే. నేను రోజూ వినే పది పాటల్లో నాలుగు కీరవాణి గారివే ఉంటాయి. ఆయన విలువైన సమయాన్ని కేటాయించి మా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాలోని ‘కాలం సూపుల గాలంరా..’ పాట రిలీజ్ చేసినందుకు కీరవాణి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ పాటకు గోరేటి వెంకన్న సాహిత్యం, అరుణ్ చిలువేరు కంపోజిషన్, రామ్ మిర్యాల పాడిన విధానం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఈ పాట వినండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అన్నారు.

‘కాలం సూపుల గాలంరా..’ పాటకు గోరేటి వెంకన్న లిరిక్స్ అందించగా..అరుణ్ చిలువేరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. రామ్ మిర్యాల పాడారు. ‘కాలం సూపుల గాలంరా ఇది కవ్వించేటి మేళము తాళము..మంటిని మింటిని వేళము వేసేటి అంగడి ఆటరా..కాసుల కట్టల ఆశరా ఇది కాటికి పోయిన ఇడువదు ఒడువదు దోసిలికందదు దప్పిక తీరదు ఎండమావిరా కొండలమీది సుక్కల పందిరి అందేదెన్నడు సోదరా హద్దులు లేని ఆకాశానికి అంచులు వెతకకురా ‘ అంటూ సగటు మనిషి జీవితానికి, అతని భావోద్వేగాలకు అద్దం పట్టేలా సాగుతుందీ పాట.

సినిమా

Tollywood: ‘పక్కోడి ముందు పరువు తీసేసుకోవాలి’ ఇదే టాలీవుడ్ నయా ట్రెండ్..!

Tollywood: ఎక్కడైనా, ఎవరైనా తమ పరువు కాపాడుకోవాలనే చూస్తారు. వేరేవారి ముందైతే తప్పనిసరిగా కాపాడుకుంటారు. కానీ.. తెలుగువాళ్లు తమ పరువు తీసుకోవడానికి.. మరీ ముఖ్యంగా ఇతరుల...

Ram Charan Birthday Special: ‘ఇంతై.. ఇంతింతై..’ తెలుగు సినిమాపై రామ్...

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ, ఇటు సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్నారు రామ్...

రాబిన్ హుడ్ కోసం డేవిడ్ వార్నర్ వచ్చేశాడు..!

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ...

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న...

రాజకీయం

యుద్ధ ప్రాతిపదికన రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.!

రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన...

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

ఎక్కువ చదివినవి

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

బల ప్రదర్శనతో వైఎస్ జగన్ ఏం సాధిస్తారు.?

మొన్న గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా పోటెత్తిన జన సందోహం.! నిన్న కూడా ఓ వివాహ వేడుకకి హాజరైతే, అక్కడా జన సంద్రం.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

ఇండియన్‌ సినిమా క్వీన్‌ రష్మిక

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న 'ఛావా' సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యేసుబాయి పాత్రలో రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఛావా సినిమా సూపర్ హిట్ కావడంతో...

Ram Charan Birthday Special: ‘ఇంతై.. ఇంతింతై..’ తెలుగు సినిమాపై రామ్ చరణ్ హవా..

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ, ఇటు సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్. తొలి సినిమా ‘చిరుత’లోనే నటనలో...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...